TT Ads

ఖమ్మం : హోలీ ఆడి స్నానానికి వెళ్లి గిరిజన లంబాడీల బాలుడు బానోత్ నగేష్ వయసు (15) సంవత్సరాలు బాలుడు మృతి చెందింది చెరువులో కాదు గుంటలో అనే డాక్టర్ కెవి కృష్ణారావు తెలిపారు .రఘునాథపాలెం మండల కేంద్ర సమీపంలో గల శ్మశాన వాటికలో రెవెన్యూ , ఇరిగేషన్ కు సంభందించిన డిపార్ట్మెంట్ వారు మట్టి తవ్వకాలకు రెండు గుంటలను తవ్వి తిరిగి వాటిని పూడ్చకపోవడం ఫలితంగా ఆ గుంట లోతుగా ఉండటంతో చెత్త , చెదారం , వేస్ట్ వాటర్ కు ఆలవాలంగా మారిందని , దానిపై స్థానిక అధికారులతో చర్చించడం జరిగిందని , జిల్లా కలెక్టర్ గారికి సైతం వినతి పత్రాలు సమర్పించనున్నారని , వెంటనే స్పందించి ఆ రెండు గుంటలను పూడ్చమని చెప్పిన , పూడ్చకుండా నిర్లక్ష్యం చేశారని దాని ఫలితంగా నిన్న ఆదివారం నాడు మూడు గంటల ప్రాంతంలో హోలీ ఆడి మృతుడు నగేష్ తనతో పాటు ఇద్దరు స్నేహితులతో కలిసి స్థానానికి గుంటలో దిగారని , గుంట లోతుగా ఉండటం వల్ల మునిగిపోయి నగేష్ మరణించాడని స్థానికులు తెలిపారని అన్నారు .కానీ పోలీస్ వారు తమ ఎఫ్.ఐ.ఆర్ ( FIR ) లో గుంట గురించి రాయకుండా చెరువులో మృతిచెందారని పేర్కొనడం తగదన్నారు .వివిధ ప్రభుత్వ శాఖల తప్పిదాన్ని కప్పుపుచ్చడానికి ఎఫ్.ఐ.ఆర్ ను తయారు చేశారని ఆరోపించారు .ఆ FIR ను మార్చి మృతి ఘటనపై దర్యాప్తు చేయాలని , గుంటలను పూడ్చకుండా , బాలుడి మృతి పట్ల పరోక్షంగా కారణమైన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు . అలాగే ఆ మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు . సంఘటనా స్థలానికి వెళ్లకుండా ఎవరో చెప్పితే తయారు చేసిన FIR ను మార్చాలని అన్నారు . తన పక్షంలో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో SC , ST పరిరక్షణ సమిటీ రాష్ట్ర కన్వీనర్ గుంతేటి వీరభద్రం , సంచార జాతుల సంఘం కన్వీనర్ సోమరాజు , LHPS రాష్ట్ర కన్వీనర్ బానోతు భద్రునాయక్ , సామాజిక ఉద్యమకారిణి షేక్ నజీమ్ , బహుజన నాయకులు రామారావు , శ్రీను , నరేందర్ , నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు .

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *