TT Ads

చత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో ఘోటీయా సమీపంలో సీఆర్‌పీఎఫ్‌, డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌, సీఏఎఫ్‌ భద్రతా బలగాలు సెర్చింగ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి.ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడి జవాన్లపై కాల్పులు జరిపారు.వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపారు.ఇరువర్గాల మధ్య సుమారు 15 నిమిషాలు భీకర పోరు జరిగింది.ఈ క్రమంలోనే మావోయిస్టులు మూడు ఐఈడీలు పేల్చి అక్కడి నుంచి పారిపోయారు.కాల్పుల విరమణ అనంతరం జవాన్లు ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని గాలింపులు చేపట్టారు.ఈ క్రమంలో ఘటనా స్థలంలో మందుపాతర, ఆయుధాలు, వస్తు సామగ్రి, విప్లవ సాహిత్యాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *