TT Ads

పశ్చిమ గోదావరి జిల్లా(ఏలూరు):గ్రామీణ హెల్త్‌ క్లినిక్‌లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు (పీహెచ్‌సీ) అనుసంధానం చేయడంతో ఉన్న ఊళ్లోనే అత్యాధునిక వైద్యం అందించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి లక్ష్యం,ప్రతి 2,500 మంది జనాభాకు ఒక వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్.రాష్ట్రంలో వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ భవనాల నిర్మాణం ముమ్మరంరూ.1,443 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో 8,585 క్లినిక్స్‌,జూన్‌ ఆఖరుకు పూర్తి.. అధునాతన వైద్య సదుపాయాలు.మొత్తం 10,011 క్లినిక్‌లలో ప్రజలకు సత్వర వైద్యం..ఒక్కో మండలంలో రెండు పీహెచ్‌సీలు.. నలుగురు వైద్యులు..ప్రతి పీహెచ్‌సీకి ఒక డాక్టర్‌తో కూడిన అంబులెన్స్‌..మొత్తంగా ఒక్కో మండలంలో ఆరుగురు వైద్యులు..విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లతో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అనుసంధానం..ఒక్కో వైద్యుడు తన పరిధిలోని గ్రామాలకు నెలలో ఏడెనిమిది సార్లు విజిట్గ్రామీణ హెల్త్‌ క్లినిక్‌లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు (పీహెచ్‌సీ) అనుసంధానం చేయడంతో పాటు ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థను కూడా త్వరలో అమల్లోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థ ప్రయోగాత్మకంగా కొనసాగుతోంది..

ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,145 పీహెచ్‌సీలు ఉన్నాయి. ప్రతి మండలానికి రెండు చొప్పున లేని చోట్ల కొత్తగా ఏర్పాటు చేస్తారు..(560 అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లు వీటికి అదనం)

ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తారు.రాష్ట్రంలో ప్రస్తుతం 1,145 పీహెచ్‌సీలు ఉన్నాయి.ప్రతి మండలానికి రెండు చొప్పున లేని చోట్ల కొత్తగా ఏర్పాటు చేస్తారు..(560 అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లు వీటికి అదనం)ఒక్కో పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యుల చొప్పన నలుగురు వైద్యులు ఉంటారు. 24 గంటల పాటు వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు ప్రతి పీహెచ్‌సీలో డాక్టర్‌తో కూడిన అంబులెన్స్‌ (104) అందుబాటులో ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో మండలంలో ఆరుగురు వైద్యులు అందుబాటులో ఉంటారు.108 అంబులెన్స్‌ ప్రతి మండలంలో ఒకటి అందుబాటులో ఉంటుంది.ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్‌్టలో భాగంగా ఒక్కో వైద్యుడు తన పరిధిలోని గ్రామాలను నెలలో ఏడెనిమిది సార్లు విజిట్‌ చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. తద్వారా ఉన్న ఊరిలోనే ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి..

ప్రతి 2,500 మంది జనాభాకు ఒక వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ అందుబాటులో ఉంటుంది. చిన్న చిన్న జబ్బులకు పీహెచ్‌సీ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.ప్రతి క్లినిక్‌లో బీఎస్సీ నర్సింగ్‌ అర్హత కలిగిన మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ను నియమిస్తారు. ప్రస్తుతం ఉన్న ఏఎన్‌ఎం కూడా అందుబాటులో ఉంటుంది. ఆశా వర్కర్లు కూడా ఉంటారు.కనిష్టంగా 90 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. 12 రకాల వైద్య సేవలందించనున్నారు. గర్భిణులు, చిన్నారుల సంరక్షణ, నవజాత శిశువులకు, ఏడాదిలోపు వయసున్న శిశువులకు ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకుంటారు.

అన్ని రకాల వ్యాక్సిన్‌లు ఉంటాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇక్కడే టీకాలు వేయించుకునే అవకాశం ఉంటుంది. అసాంక్రమిక వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు వివరిస్తారు..తరచూ వచ్చే చిన్న చిన్న సమస్యలు, ఈఎన్‌టీ సమస్యలపై అవగాహన కల్పిస్తారు. వయసు పైబడినప్పుడు వచ్చే సమస్యల నివారణతో పాటు అత్యవసర మెడికల్‌ సర్వీసెస్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తారు. మానసిక వ్యాధులను ముందే గుర్తించి నియంత్రించే చర్యలను చేపడతారు..

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *