TT Ads

మండల పరిధిలోని పులిగడ్డ రైతు భరోసా కేంద్రం (రై.భ.కే) వద్ద 55 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడు. గురువారం పులిగడ్డలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఇతనిని స్థానికులు ఏ ఊరు అని అడిగితే మూలలంకని, మూలపాడని, మూలతోటని పలు రకాల గ్రామాల పేర్లు చెప్పినట్టు కొంతమంది స్థానికులు చెప్పారు. మద్యం సేవించి ఉన్న ఈ వ్యక్తి రై.భ.కే వద్ద రాత్రి పడుకున్నాడు. నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. లైట్ బ్లూ కలర్ ఫ్యాంట్, ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకుని ఉన్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మృతదేహంను అవనిగడ్డ ఏరియా ప్రభుత్వ వైద్యశాల మార్చురీలో భధ్రపరచారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏ.ఎస్.ఐ గణేష్ చెప్పారు. ఈ వ్యక్తిని గు‌ర్తించిన వారు అవనిగడ్డ పోలీసు స్టేషన్ కు సమాచారం అందించాలని ఏ.ఎస్.ఐ తెలిపారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *