TT Ads

కనగాన పల్లి మండలం, తుంచెర్ల పంచాయితీ, గుంతపల్లి ఎస్సీ కాలనీలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఉదయం గుంతపల్లి ఎస్సీ కాలనీలోని ఓటర్లను ఓటు వేయనీయకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేయడం వలన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని వార్తలు రావడంతో జిల్లా కలెక్టర్ యుద్ధ ప్రాతిపదికన చర్యలకు ఆదేశించారు. పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసుల పర్యవేక్షణలో ప్రస్తుతం ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ ఘటనలో గాయపడిన ఓ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉంది.

పోలింగ్ పూర్తయ్యేవరకూ పోలీసులు గ్రామస్తులకు రక్షణగా నిలిచి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. తదుపరి ఆదేశాలు అందేవరకూ గ్రామంలో పోలీసు కేంద్రం కొనసాగనుంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *