TT Ads

చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలను అరికట్టడానికి, సదరు కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఎంతో నిబద్దత కలిగిన విభాగంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగము ఆవిర్భవించిందని గుంటూరు రూరల్ జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ శ్రీ ఆరిఫ్ అఫీజ్ ఐపిఎస్ తెలిపారు.

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగములో అవినీతికి ఏటువంటి తావులేకుండా శూన్య సహన విధానము(Zero Tolerance Policy) ను పాటించడం జరుగుతుందని తెలిపారు.

ఎన్ఫోర్స్మెంట్ విధులు/కార్యకలాపాలు నిర్వహించే ఒక నిబద్దత కలిగిన విభాగముగా ఎల్లప్పుడూ అవినీతికి వ్యతిరేకంగా SEB పోరాడుతుందని తెలిపారు.

SEB విభాగానికి చెందిన సిబ్బంది ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నట్లు ఏదైనా సమాచారం అందిన మరుక్షణమే సదరు సిబ్బందిని విధుల నుండి తొలగించి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

SEB విభాగానికి చెందిన సిబ్బంది గానీ, లేదా SEB విభాగము యొక్క పేరును ఉపయోగించి బయట వ్యక్తులు ఎవరైనా గానీ, అవినీతికి పాల్పడుతున్నట్లు ఏదైనా సమాచారం ఉన్నయెడల, సదరు సమాచారాన్ని వెంటనే 9440796202 అనే ఫోన్ నంబరు కు ఫోన్ ద్వారా గాని, వాట్సప్ ద్వారా గాని మరియు గుంటూరు జిల్లా SEB కంట్రోల్ రూమ్ నంబర్ 9490619495 గానీ నేరుగా గుంటూరు రూరల్ జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగపు అదనపు ఎస్పీ కి తెలియపరచవచ్చు అని, ప్రజలకు,ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను అని అదనపు ఎస్పీ తెలిపారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *