TT Ads

అమరావతి:తొలివిడతగా గుంటూరు జిల్లాలో 18 మండలాల్లో 129 గ్రామాలను అమూల్‌ ప్రాజెక్టుకు ఎంపికచేశారు. ఈ గ్రామాలను 115 రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానం చేసి పాలసేకరణ ప్రారంభిస్తున్నారు. గ్రామ వలంటీర్లు గ్రామాల్లో సర్వేచేసి 15,328 మంది మహిళా రైతులకు 20,686 పాడి ఆవులు ఉన్నట్లు గుర్తించారు.గుంటూరు జిల్లాలో 831 బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌ (బీఎంసీయూ)ల ద్వారా పాలు సేకరించి పాల నాణ్యత, వెన్న శాతం ఆధారంగా లీటరుకు రూ.5 నుంచి రూ.7 వరకు రైతులకు అదనపు ఆదాయం లభించే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
గుంటూరు జిల్లాలో అమూల్‌ ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ నేడు వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *