TT Ads

గుంటూరు జిల్లాలో నిత్యావసర సరుకులు, ఆహార పదార్ధాలు కల్తీ చేసి విక్రయిస్తున్న వ్యాపార సంస్థలపై గురువారం ఉదయం నుండి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న సివిల్ సప్లయిస్, ఫుడ్ సేఫ్టీ, రెవిన్యూ, మునిసిపల్, లీగల్ మెట్రాలజీ అధికారులు.గుంటూరు నగరంలో పలు రెస్టారెంట్లను తనిఖీ చేసి నిల్వ ఉంచిన మాంసమును వినియోగిస్తున్న బర్కాస్, శ్రీ ఆంజనేయ రెస్టారెంట్లను సీజ్ చేసి కేసులు నమోదు.జిల్లా వ్యాప్తంగా గ్రామ, మండల, మునిసిపాలిటీ స్థాయిలో ప్రత్యేక టీములతో నిత్యావసర సరుకులు, ఆహార పదార్ధాలు కల్తీ చేసే వ్యాపార సంస్థలపై తనిఖీలు కొనసాగుతున్నాయి.కల్తీ కి పాల్పడిన వ్యాపార సంస్థలను సీజ్ చేయడంతో పాటు ఆహార భద్రత చట్టం, తూనికలు కొలతల శాఖ యాక్ట్, సివిల్ సప్లయిస్ యాక్ట్, ట్రేడ్ లైసెన్స్ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాము.నిత్యావసర సరుకులు, ఆహార పదార్ధాలు కల్తీ చేసి విక్రయిస్తున్న వారి సమాచారం టోల్ ఫ్రీ నెంబర్ 1902 కి ఫోన్ చేసి తెలిపితే వెంటనే దాడులు చేసి చర్యలు తీసుకుంటాం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *