TT Ads

ఖమ్మం నగరం గాంధీ చౌక్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక జిమ్ సెంటర్ లో దొసపటి కృష్ణ ప్రసాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో ముఖ్యఅతిథిగా జిల్లా కాంగ్రెస్ నాయకుడు, ఖమ్మం నగర పాలక సంస్థ మాజీ కార్పొరేటర్ యర్రం బాల గంగాధర్ తిలక్ పాల్గొన్నారు .పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించిన దోసపటి కృష్ణ ప్రసాద్ పౌండేషన్ ను అభినందించారు. నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని తిలక్ ఆకాంక్షించారు. రెండో దశ కరోనా ఉదృతం అవుతున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ పొందుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు. విధిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం, తో పాటు పౌష్టిక ఆహారం తీసుకుని వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అని ఆయన కోరారు. వ్యాయామం కూడా క్రమం తప్పకుండా చేయాలని ఆయన సూచించారు. అలసత్వం, నిర్లక్ష్యం వీడీ అధికారులు చేస్తున్న సూచనలు పాటించి కరోనా వ్యాప్తి చెందకుండా మనమందరం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దోసపాటి రమేష్,ఎడి వేణుగోపాల్ ,సాయి సుధీర్ ,
గోపాలకృష్ణ ,వెంకటేశ్వర్లు, నాగేందర్ ,వాసు ,సురేష్ ,సుజాత తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *