TT Ads

ఖమ్మం టౌన్: ఆదివారం ఖమ్మం నగరంలో జరిగిన ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంఘాల జేఏసీ ఎన్నికలలో చైర్మన్ గా డాక్టర్ పులిపాటి ప్రసాద్, కన్వీనర్ గా అడ్వొకేట్ కొత్త వెంకటేశ్వర్లు, కోశాధికారి గా గోళ్ళ రాధాకృష్ణమూర్తి, మహిళా విభాగం చైర్మన్ గా రాయల ఈశ్వరి, గౌరవ సలహా దారులు గా ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు గెల్లా జగన్మోహన్ రావులు ఎన్నిక కాబడినట్లు ఈ రోజు, గురువారం ఎలక్షన్ ఆఫీసర్ లు నోముల వెంకటేశ్వర రావు, బూర్లె వెంకటేశ్వర్లు ప్రకటించారు. అడ్వకేట్ దేవకి శ్రీనివాస్ గుప్తా ఈ ఎన్నికకు అబ్జర్ వర్ గా వ్యవహరించారు.

చైర్మన్ గా ఎన్నికైన డాక్టర్ పులిపాటి ప్రసాద్ గారు మాట్లాడుతూ నేడు ఆర్యవైశ్యులు కూడా పలు సమస్యలు ఎదుర్కొంటు న్నారు. వాటిలో ముఖ్యమైనది ఆర్య వైశ్య కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ కోసం పలు రకాల ఉద్యమాలు జరిగాయి. పలు పార్టీల మానిఫెస్టోలలో ఆర్య వైశ్య కార్పొరేషన్ అంశం పొందు పరచినా, ఇంకా కార్యాచరణకు నోచుకోలేదని పేర్కొన్నారు. అలానే పేద వైశ్యులకు డబుల్ బెడ్ రూం ఇళ్ళు, రేషన్ కార్డులు, దామాషా ప్రకారం నామినేటెడ్ పదవులు తదితర ప్రభుత్వ ఫలాలు ఇంతవరకు అంద లేదు. కావున ఈ జేఏసీ ఈ అంశాలపై కార్యాచరణ చేపట్టడమే కాక , ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం, రాజకీయంగా ఎదగడానికి తగు సలహాలు, సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. అలాగే ఈ సంఘ కార్యవర్గాన్ని త్వరలో ఉమ్మడి జిల్లా లోని అన్ని మండలాలకు విస్తరించి, మండలాల్లో ఉన్న ఉత్సాహ వంతులైన ఆర్యవైశ్య నాయకులను బాధ్యులుగా నియమిస్తామని పేర్కొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *