TT Ads

కోవిడ్ సెకండ్ వేవ్ చాలా తీవ్ర స్ధాయిలో ఉంది. పాజిటివ్ ఉన్నవారికి సిటిలో ఏ పేరున్న కార్పొరేట్ ఆసుపత్రిలోనూ బెడ్ దొరకటానికి కనీసం రెండు మూడు రోజుల వెయిటింగ్ ఉంది. పరిస్ధితి తీవ్రత ప్రజలకు తెలియకుండా, ప్రభుత్వాలు ‘ఉన్నవారు ఉంటారులే’ అన్న తీరుగా వ్యవహరిస్తూ గుంభనంగా పెద్ద పెద్ద మీటింగులన్నీ కాన్సిల్ చేసి పడేసి ఊరుకుంటున్నాయి.

ఒక్కొక్క దేశమే (నిన్న న్యూజిలాండ్ రెడ్ జోన్ గా డిక్లేర్ చేసి, ఇండియా నుంచి రాకపోకలు నిషేధించింది) మనను బాన్ చేస్తోంది. ప్రస్తుతం ఎవరికి వారు శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి లో‌ మనం ఉన్నాము. దయచేసి, దిగువ తెలిపిన విషయాలను దృష్టిలో పెట్టుకోండి.

  1. సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ కన్నా బలంగా ఉంది. తేలిగ్గా తీసుకోవడానికి లేదు. మాస్క్, సానిటైజర్ తప్పనిసరిగా వాడండి.
  2. ఏ పబ్లిక్ ఫంక్షన్స్ కూ వెళ్లకండి, కోవిడ్ చాలా తీవ్రస్థాయిలో ఉంది హైదరాబాదులో, మిగతా చోట్లానూ. పండుగల ప్రయాణాలు మానుకోండి.
  3. గొంతునొప్పి, సడన్ గా గొంతు పట్టేసినట్టు ఉండడం, స్వల్ప జ్వరం, పొడి జలుబు… దేన్నీ అలక్ష్యం చెయ్యకండి. వెంటనే కోవిడ్ పరీక్ష చేయించుకోండి. డాక్టర్ల సలహాతో ఆంటీబయొటిక్ మొదలు పెట్టండి, జాగ్రత్తగా ఇంట్లో ఒక గదిలో ఉంటూ, మందులు వాడుతూ, మీ‌కుటుంబ సభ్యుల స్ధితిగతులను కూడా గమనిస్తూ ఉండండి.
  4. కోవిడ్ ఎలాంటి వ్యాధంటే, దీనికి నాలుగైదు రోజులు సందిస్తే, ఇది మీ ఊపిరితిత్తులను పాడుచేస్తుంది. ముఖ్యంగా షుగర్, బిపి ఉన్నవారు, దయుంచి, జ్వరమే కదా అని తాత్సారం చెయ్యవద్దు. అది ప్రాణాంతకంగా మారవచ్చు. క్వారంటైన్ చేస్తారేమో, ఫ్లాట్స్ వారు ఏమైనా అంటారేమో అన్న భయాలొద్దు. సంకోచాల కంటే జీవితాలు చాలా ముఖ్యం.

5.పాజిటివ్ ఉన్నవారు ఆక్సీమీటర్ తో మీ ఆక్సిజన్ లెవెల్స్ ను నిరంతరం మానిటర్ చేసుకోండి.93 కు తగ్గితే హాస్పిటల్ కు వెళ్లడం తప్పనిసరి‌. ప్రాణాయామం, ఆవిరి పడుతూ ఉండడం చాలా ముఖ్యం.

  1. మీ ఇంట్లో ఒకరికి పాజిటివ్ వస్తే, మిగతా వారిని చుట్టాలు, ఫ్రెండ్స్ ఇళ్లకు పంపకండి, మీ ఇంటికి అలా ఎవరినీ రానివ్వకండి. తన్నుమాలిన ధర్మం వర్తించదు ఇక్కడ.‌
  2. వీలున్నంత వరకు బయటకు వెళ్లడం, తగ్గించాలి. పాజిటివ్ ఉన్నవారు ఎంత అత్యవసరమైన పనులున్నా బయటకు వెళ్లకుండా క్వారంటైన్ లో ఉండడం మంచిది. మొదటిరోజు నుంచి శ్రద్ధ వహిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది.
  3. టీకాలు వేయించుకున్నా కోవిడ్ రాదన్న గారెంటి లేదు, వారికీ వస్తోంది.‌ ఒకసారి కోవిడ్ వచ్చి తగ్గినా తిరిగి రాదన్న నమ్మకం లేదు. ఇన్ ఫెక్షన్ బలంగా ఉంది. జాగ్రత్తగా ఉండండి. కోవిడ్ వచ్చినా పానిక్ అవకండి, ధైర్యంగా సానుకూల దృక్పథంతో, మందులు వేసుకుంటూ ఫేస్ చెయ్యండి.
  4. ట్రీట్ మెంట్ కి ఏ కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లినా పది లక్షల కన్నా తక్కువ కావట్లేదు. ఎంత డబ్బు, పరపతి ఉన్నా తీవ్రత పెరిగేదాకా కాళ్లుచాపుకు కూర్చుంటే, ఉపయోగం లేదు.
  5. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అవసరాలేవో, అత్యవసరాలేవో ప్రయారిటైజ్ చేసుకుని, తప్పనిసరి అయితే తప్ప ఇల్లు కదలకపోవడం మంచిది.

ఇవన్నీ మిమ్మల్ని అలర్ట్ చెయ్యాలని మీ భద్రత కోసం చెబుతున్నవి. ఎవరో వస్తారని, ఏదో చూస్తారని ఆశ వదిలేసుకుని, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవడం ప్రస్తుత స్ధితిలో మీ కర్తవ్యం!

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *