TT Ads

అనంతపురం: కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యలపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, ఎమ్మెల్సీలు శమంతక మణి, కత్తి నరసింహా రెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎస్పీ సత్య ఏసు బాబు, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ , కోవిడ్ నోడల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోవిడ్‌ను డీల్ చేసిన విధానంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసంశలు వచ్చాయన్నారు. విపత్తును ఎదుర్కొనేందుకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో పాటు జిల్లాకు ఒక సీనియర్ అధికారిని నియమించామన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *