TT Ads

ఈ రోజు ఉదయం 6:30 గంటల నుండి మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పలాస కాశీబుగ్గ ప్రధాన రహదారులలో అధికారులు, పోలీస్ సిబ్బందితో ఆకస్మిక పరిశీలన చేశారు. ముందుగా శానిటేషన్ పనులను పరిశీలించిన ఆయన అనంతరం కాశీబుగ్గ మార్కెట్ కు వెళ్లి అక్కడ జన సమూహాలను చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు, అక్కడి నుండే అధికారులకు ఆదేశాలు జారీ చేసి మార్కెట్ ను బంకేశ్వరి ఆలయం నుండి కాశీబుగ్గ పెట్రోల్ బంక్ వైపు రోడ్లకు ఇరువైపులా తరలించి మార్కెట్ ను వికేంద్రీకరించారు, చిరు వ్యాపారులు దీనిపై ఒకింత అసహనం చేసినప్పటికీ కోవిడ్ నియంత్రణ దృశ్యా మార్కెట్ ను తరలించి వికేంద్రీకరణ చేయడం తప్పదని దీనిని మీరంతా అర్థం చేసుకోవాలని మంత్రి వారికి తెలియజేయడంతో సానుకూలంగా స్పందించారు, మున్సిపల్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బందికి సూచన చేస్తూ మార్కెట్ చేయదలచిన విక్రయదారులకు ప్రస్తుతం నిర్వహిస్తున్న మార్కెట్ వైపు తరలించాల్సిందిగా ఆదేశించారు.

అలాగే ప్రజలంతా దీనిని గమనించాలని కొద్దిరోజులు బస్టాండ్ ఆవరణలో మార్కెట్ నిర్వహణను ఆపుతున్నామని, అక్కడ జరిగే మార్కెట్ బంకేశ్వరి ఆలయం దగ్గరకు తరలించామని ప్రజలు అక్కడకు వెళ్లి మార్కెట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు.నిత్యావసరాలు కొనుగులు, అత్యవసర పరిస్థితులలో ఇంట్లో ఒక్కరు మాత్రమే మార్కెట్కు రావాలని, అనవసరంగా రోడ్లపై ఎవరు తిరగవద్దని, ప్రస్తుత పరిస్థితుల్లో స్వీయ నియంత్రణ మాత్రమే మనల్ని రక్షిస్తుందని అన్నారు.ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉంది కోవిడ్ నియంత్రణకు సహకరించాలని, తప్పని సరిగా మస్కులు ధరించాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *