TT Ads

న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో రాష్ట్రాలు విధిస్తున్న లాక్‌డౌన్లు, కర్ఫ్యూల ప్రభావం దేశవ్యాప్త వ్యాక్సిన్ డ్రైవ్‌‌పై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు అర్హులైన వారు కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లకు చేరుకునేలా, ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని, లాక్‌డౌన్లు, కర్ఫ్యూలతో వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై ప్రతికూల ప్రభావం పడనీయరాదని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. అదేవిధంగా, డెడికేటెడ్ కోవిడ్ 19 ఆసుపత్రులుగా గుర్తించిన సీవీసీలు నిరాటంకంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ సేవలు అందించేలా చూడాలని పేర్కొంది. ఆయా ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ సర్వీసులకు ప్రత్యేక బిల్డింగ్, లేదా బ్లాక్‌లు ఏర్పాటు చేయాలని సూచించింది. కాగా, దేశంలో కోవిడ్ కొత్త కేసులు గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2.61 లక్షలు నమోదైనట్టు, 1,501 మరణాలు సంభవించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారంనాడు వెల్లడించింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 18,01,316కు చేరినట్టు పేర్కొంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *