TT Ads

కరోనా కారణంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారుకరోనాతో బలైన కుటుంబాలకి ప్రభుత్వం చేయూత ఇవ్వటం లేదు.మొదటి వేవ్ సడన్ గా వచ్చింది కాబట్టి ఏం చేయాలో తెలియక పోవచ్చు,కాని సెకండ్ వేవ్ లో కూడా ప్రభుత్వం అలాగే ముందుకు వెళ్ళింది.ఆక్సిజన్ మరణాలు అన్ని ప్రభుత్వ వైఫల్యం కారణంగా జరిగినవి.కోవిడ్ మరణాలు ప్రభుత్వం చెబుతున్న వాటికి కేంద్ర ప్రభుత్వ0 చెప్తున్న వాటికి సంబంధం లేదు.చంద్రన్న భీమా ఉంటే ఈ రోజు కోవిడ్ మృతులకు డబ్బులొచ్చేవి,కానీ ఇప్పటికీ ప్రభుత్వం కోవిడ్ బాధితులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు.కోవిడ్ మరణాల లెక్కలు సరిగ్గా చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.గద్దె రామ్మోహన్ టీడీపీ mlaతిట్లీ తుఫాన్ వస్తే చంద్రబాబు అక్కడుండి పేదవారిని ఆదుకున్నారు.కానీ ఇక్కడ కరోనా వస్తే పేదవారిని పరామర్శించేందుకు రాలేదు.వారి మరణాలు కూడా సరిగ్గా లెక్కలు చెప్పకుండా దాస్తున్నారు.కేరళ మనకన్నా ఎక్కువ కేసులు ఉన్నా మరణాలు అరికట్టారు.ప్రతి గ్రామంలో యాభై బెడ్లు ఏర్పాటు చేసి కోవిడ్ చికిత్స అందించారు.మీరు మాత్రం గాలికొదిలేసి ఈ రోజు కోవిడ్ మృతుల కుటుంబాల్ని కూడా పట్టించుకోవడం లేదు.మాజీ మంత్రి దేవినేనిఉమా మహేశ్వరరావు,ఈ రోజు 175 నియోజకవర్గాలలో నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నాము.అన్ని సబ్ కలెక్టర్ కార్యాలయాలలో వినతి పత్రాలు ఇస్తున్నాం.మొదటి వేవ్ ని నిర్లక్ష్యం చేశారు..అలాగే రెండవ వేవ్ ని కూడా చేయడం వలన.మరణాలు ఎక్కువయ్యాయి.కేంద్రం లక్షా ముప్పయి వేలు అంటే మీరు 90 వేలు అంటున్నారు.కరోనా అన్ని దొంగ లెక్కలు,కాకి లెక్కలు చెప్తున్నారు.తమిళనాడులో జయలలిత లేకపోయినా స్టాలిన్ అమ్మా క్యాంటీన్ లు నడుపుతున్నారు.మీరు ఎందుకు అన్నా కాంటీన్ లు మూసి వేశారు.మీకు బుద్ధి ఉందా..దాని వలన ఎంతో మంది పేదవారు భోజనం చేసేవారు.జర్నలిస్ట్ లు ఈ జిల్లాలోనే ఐదుగురు చనిపోయారు..వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్ లో చేర్చడానికి ఏంటి ఇబ్బంది.అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోవిడ్ బాధితుల్ని, హాస్పిటల్స్ ని తనిఖీలు చేస్తున్నారు.మీరు మాత్రం తాడేపల్లి ప్యాలస్ లో ఉండి పారాసిట్మల్ వాడమంటారా,బ్లీచింగ్ వాడమంటారా.టీడీపీ హయాంలో పత్తిపాటి ఏసమ్మ కి ఇల్లు ఇస్తే ఆమె సరిహద్దులు పీకేశారు.అక్కడ చదువుకునేవారి మీద కూడా sc ,st కేసులు పెట్టారు.పేదల ఇళ్ల సమస్యల గురించి మేము అడగడానికి వెళ్తే మామీద కేసులు పెట్టిస్తారా,అందుకు తప్ప ఎందుకన్నా పని చేస్తారా మీరు,కచ్చితంగా కోవిడ్ బాధిత కుటుంబాలని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *