TT Ads

కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సినిమా దియేటర్లు యధావిధిగా నడుస్తాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో దియేటర్లు మూతపడనున్నాయని జరుగుతున్న ప్రచారం అబద్దం. సినిమా దియేటర్ల మూసివేత పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే చిత్ర పరిశ్రమ పై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న అనేకమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రంగంపై ఆధారపడిన వివిధ విభాగాలలోని కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొన్నది. ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలను తప్పనిసరిగా థియేటర్ల యాజమాన్యాలు పాటించాలి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *