TT Ads

రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచన మేరకు చనిపోయిన వ్యక్తి కి కోవిడ్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష ఫలితం నెగిటివ్ గా తేలే వరకు చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు / బంధువులకు అప్పగించరు.మరణించిన వ్యక్తి ద్వారా అనవసరంగా ఇతరులకు సంక్రమణ ద్వారా వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రభుత్వము ఈ నిర్ణయము తీసుకున్నది.ఒకవేళ చనిపోయిన వ్యక్తి యొక్క కోవిడ్ పరీక్ష ఫలితం పాజిటివ్ గా నిర్ధారణ అయితే, అప్పుడు చనిపోయిన వ్యక్తి యొక్క మృతదేహ నిర్వహణ ఈ కింది తెలిపిన ప్రోటోకాల్ ప్రకారము నిర్వహించవలసి ఉంటుంది.

ఏదేని ఆసుపత్రిలో కోవిడ్ కారణము తో సంభవించి ప్రతీ మరణమును సంబంధిత హాస్పిటల్ సూపరింటెండెంట్ నిర్దేశించిన సమాచార ప్రోటోకాల్ అనుసరించి మొదటగా నియమించబడిన నోడల్ లేదా స్పెషల్ ఆఫీసర్ కు, మరియు అతని ద్వారా జిల్లా కలెక్టర్ కు తెలియ చేయబడాలి.మృతదేహ నిర్వహణకు సంబందించి హాస్పిటల్ సిబ్బందికి చేసిన సూచనలు.మృతదేహాన్ని వార్డు నుంచి తొలగించడానికి డ్యూటీ లో ఉన్న ఆరోగ్య కార్యకర్త తగు రక్షణ కొరకు సరైన పిపిఇ కిట్ ధరించి జాగ్రత్తగా నిర్వహించాలి.

మృతదేహం యొక్క నోరు, నాసికా రంధ్రాలను మూసి వేసి మృతదేహాన్ని లీక్ ప్రూఫ్‌లో ప్లాస్టిక్ బాడీ బ్యాగ్ లో ఉంచాలి.తరువాత మృతదేహం ఉంచబడిన బాడీ బాగ్ ని మార్చు రీ షీట్ తో, లేదా మృతదేహానికి చెందిన కుటుంబసభ్యులు ఇచ్చిన వస్త్రాలను చుట్టాలి.మృతదేహాల యొక్క ఎంబామింగ్ వంటి పనులు చేయకూడదు, మరియు వాటిని అనుమతించకూడదు.శవపరీక్షలు చేయడం, నిర్వహించడం చేయకూడదు.మృతదేహానికి చెందిన కుటుంబసభ్యులకు మరియు బంధువులకు చేసిన సూచనలు.మరణించిన వ్యక్తి శరీరము బాడీ బ్యాగ్ లో చుట్టబడిన తర్వాత మాత్రమే మృతదేహాన్ని బంధువులకు అప్పగించడము జరుగుతుంది.

మృతదేహాన్ని దహన లేదా బరియాల్ కి తరలించిన తరువాత, మృతదేహం తరలించిన వాహనము మరియు సిబ్బంది 1% సోడియం హైపో క్లోరైట్ తో క్రిమి సంహారకము చేసుకోవాలి.మృతదేహానికి స్నానం చేయించడం, మృతదేహాన్ని ముద్దు పెట్టుకోవడం, కౌగిలించు కోవడం వంటివి అనుమతించబడవు.శ్మశానవాటిక లేదా బరియాల్ మైదానంలో 20 కి మించి వ్యక్తులు సమావేశం కాకూడదు. మృతదేహం యొక్క దగ్గరి కుటుంబ కుటుంబసభ్యుల తో వైరస్ ప్రమాదము ఉంటుంది కాబట్టి అక్కడ వారితో తగిన బౌతీక దూరం పాటించండి.వ్యక్తి కర్మకాండల నిర్వహణ నిమిత్తము బూడిదను అప్పగిస్తారు.పైన సూచించబడిన సూచనలు అమలు చేయుటకు శ్మశాన వాటిక సిబ్బందికి తగు విధంగా అవగాహన కల్పించడం జరిగింది.

స్థానిక మున్సిపల్ అధికారులకు సూచించిన చర్యలు.మృతదేహాన్ని బాడీ బ్యాగ్ ఉంచి ఆపై సరైన వస్త్రము తో సరిగ్గా చుట్టబడినది అని నిర్ధారించుకున్నా తరువాత మాత్రమే మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలి.మృతదేహాన్ని దహన లేదా ఖననం చేయడానికి రవాణా చేసే వాహనం మరియు సిబ్బంది 1% సోడియం హైపో క్లోరైట్ తో క్రిమిరహితం చేసుకోవాలి.సాధ్యమైనంత వరకు దహన సంస్కారాలు ఎలక్ట్రికల్ పద్దతి ద్వారా నిర్వహించడానికి ఏర్పాటు చేయాలి.కుటుంబ సభ్యులు కోరిన చో కర్మ కాండలు నిర్వహించుకోడానికి బూడిదను అప్పగించాలి.

ఈ కార్యక్రమాల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్మశాన వాటిక సిబ్బందికి ప్రత్యేక కౌన్సెలింగ్ ఇవ్వాలి.నగరం లేదా పట్టణంలో ఉన్న కోవిడ్ ఆసుపత్రులలో మరణాలు సంభవించినప్పుడు సంబంధిత నగరం లేదా పట్టణంలోని మునిసిపల్ కమిషనర్లు మృతదేహానికి బాధ్యత వహించి నిర్వహించాలి.ఇంకా, అన్ని బోధనా ఆసుపత్రుల యొక్క సూపరింటెండెంట్లు మరణించినవారి పరీక్ష ఫలితం హాస్పిటల్ కు అనుసంధానించబడిన పరీక్ష ప్రయోగశాల నుండి వెంటనే పొందేలా ఆసుపత్రి నోడల్ ఆఫీసర్ / మేనేజర్ సులభతరం చేయాలి.

కోవిడ్ కారణంగా సంభవించే మరణాల యొక్క సరైన సమాచారం ద్వారా నిర్ధారించాలని మరియు మృతదేహాలను నిర్దేశించిన సూచనల ద్వారా నిర్వహించి వ్యాధి మరింత మందికి వ్యాప్తి చెందకుండా మునిసిపల్ అధికారులకు తగు మార్గ నిర్దేశం చేయాలని రాష్ట్రం లో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించడం జరిగింది.CDMA రాష్ట్రం లో ఉన్న అన్ని కార్పొరేషన్లు మరియు మునిసిపాలిటీలు మునిసిపల్ కమిషనర్లకు తగిన సూచనలను జారీ చేస్తుంది. ఇకనుండి CDMA స్టేట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో కూడా భాగం గా ఉండి పనిచేస్తుంది

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *