TT Ads

సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్రంలో 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు) నిర్వహణ

  • 2021-22 విద్యా సంవత్సరానికి గాను 6, 11 తరగతుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి ప్రకటన
  • ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభించిన దరఖాస్తులు స్వీకరణ జూలై 5వ తేదీ వరకు పొడిగింపు
  • ఒక్కో కేజీబీవీలో 6వ తరగతికి 40 సీట్లు, 11 తరగతికి 40 సీట్లు చొప్పున ఖాళీలు
  • అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ (బడి మానేసిన వారు) పేద ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనారిటీ, బి.పి.ఎల్ బాలికలు మాత్రమే ఈ దరఖాస్తులకు అర్హులు
  • ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణింపబడతాయన్న వెట్రిసెల్వి
  • https://apkgbv.apcfss.in/ వెబ్సైట్లో మాత్రమే దరఖాస్తులు నింపాలని సూచన
  • ఇదివరకే కేజీబీవీల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థినులు కూడా 11వ తరగతిలో ప్రవేశానికి ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి
  • ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం
  • సమస్యలు, సందేహాలకు 94943 83617, 94412 70099 నంబర్లను సంప్రదించాలి
TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *