TT Ads

ర్యాలీతో ప్రజలకు ప్రయోజనం ఏమిటి అనే విమర్శలు గత శిలాఫలకాలు శిధిలమవుతున్న వైనం మార్కెట్ లో జరుగుతున్న అక్రమాలకు బాధ్యులెవరు రోడ్డుపైనే స్త్రీ ప్రసవించినప్పుడు రాణి మంత్రి ర్యాలీ నిర్వహించడమా కోవిడ్ నిబంధనలు మంత్రి ఉల్లంఘిస్తే చర్యలు ఏమిటి.

జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆర్ అండ్ బి శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తో కలిసి నిర్వహించిన ర్యాలీ అనేకమైన విమర్శలకు తావిస్తోంది మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ శాసనసభ్యులుగా విజయం సాధించి కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించిన దాఖలాలు లేవని ప్రజలు ధ్వజమెత్తుతున్నారు గత రెండు సంవత్సరాల క్రితం సిసి రోడ్ల కోసం హెర్బల్ పార్కుల నిర్మాణం కోసం భూమి పూజ చేసి ఏర్పాటుచేసిన శిలాఫలకాలు శిధిలమవుతున్నాయి.తప్ప పనులు ప్రారంభించడం లేదని నేడు జవహర్ నగర్ రహదారి దాదాపు రెండు కిలోమీటర్ల పొడవు మధ్యల డివైడర్ స్ట్రీట్ లైట్లతో 8 కోట్ల 20 లక్షల నిధులతో డబల్ రోడ్డు నిర్మాణం కోసం భూమి పూజ చేసి శిలాఫలకం ఏర్పాటు పట్ల ప్రజలు ఈ రోడ్డు నిర్మాణం ఐదు సంవత్సరాలు పడుతుందేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ రోడ్డు భూమి పూజ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవమే జరుగుతుందన్నంత జోష్ లో తీసిన ర్యాలీ ఎందుకు ? జవహర్ నగర్ సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సామాన్యుడిపై ఏయ్ కేసు పెట్టిస్తా ఫోన్ పెట్టెయ్ అన్నందుకా ? ఒక మహిళ నడిరోడ్డుపై ఎలాంటి వైద్య సదుపాయానికి నోచుకోక ప్రాణాపాయ స్థితిలో ప్రసవించి పసిపాప ప్రాణం కోల్పోయినా సంఘటనపై మంత్రి స్పందించనందుకా కార్పొరేషన్ ఎన్నికల ముందు 28 కోట్ల నిధులు సాంక్షన్ చేయించానని ప్రజలను మభ్యపెట్టి మోసం చేశాను ఆ 28 కోట్ల నిధుల సాంక్షన్ మాట మర్చిపోండి అని ప్రజలకు తెలియజేయడానికా.

వెంచర్లు చేసే వారు పెద్ద మొత్తంలో వాటాలు ఇస్తే చాలు మంత్రిని అనే విషయాన్ని మరిచి మద్దతు చేస్తా వాటాలు ఇవ్వకపోతే కలెక్టర్ కు చెప్పి పొట్టు పొట్టు చేపిస్తా అని హూకుమ్ చేసిన ఆడియో రికార్డు నాదే అని ప్రజలకు తెలియజేయడానికా ? సమస్యల పరిష్కారం కోసం రాలేదు గాని సభ్యత్వ నమోదు కోసం మాత్రం వచ్చాను కదా అని గుర్తు చేయడానికా ? రెండవ దఫా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోవిడ్ వైరస్ బారిన పడకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినూత్నమైన రీతిలో కోవిడ్ నిబంధనల ఆంక్షలు విధిస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రినీ అనే విషయాన్ని మరిచి కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి నేనే రాజును నేనే మంత్రినీ అన్నట్లుగా దాదాపు వెయ్యి మందితో ప్రజలకు నిరుపయోగకరమైన ర్యాలీ నిర్వహించి అమాయక ప్రజలను కోవిడ్ వైరస్ బారిన పడ వేసేందుకా.

రెండున్నర సంవత్సరాల నుండి కార్మిక శాఖ మంత్రిగా అవగాహన రాహిత్యంతో అర్థరహితంగా వ్యవహరించిన తీరు పట్ల అధిష్టానం నాపై ఆగ్రహంగా ఉంది ముఖ్యమంత్రితో కలవడానికి అనుమతి కూడా లేకపోయింది త్వరలో కార్మిక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతల నుండి తొలగించే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి అనే విషయాలను ప్రజలకు తెలియజేయడానికా ? అనే అనేకమైన విమర్శలకు మంత్రి మల్లారెడ్డి నిర్వహించిన ర్యాలీ తావిస్తోంది.

ప్రజా ప్రతినిధి అంటే తన పార్టీకి చెందిన నాయకుల పుట్టిన రోజు కార్యక్రమాలకు హాజరై కేకులు కట్ చేయడం కాదు నియోజకవర్గ ప్రజలందరూ తన కుటుంబ సభ్యులుగా భావించి నమ్మిన ప్రజల ఆశలు అడియాశలు చేయకుండా అనునిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే వాడే ప్రజా ప్రతినిధి కానీ సందర్భం లేని కార్యకలాపాలు చేస్తూ స్వార్థపూరిత ప్రయోజనాలకు పాల్పడేవాడు ప్రజా ప్రతినిధి కాడనే ఆవేదనలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి అలాగే జోహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కెసిఆర్ కూరగాయల మార్కెట్ లో మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సునీత నిర్మాణం చేసిన ఈ మార్కెట్ నిర్మాణం అక్రమ నిర్మాణమా సక్రమ నిర్మాణమా అనే విషయంపై సునీత మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వీధుల్లో ఉంటూ మేడ్చల్ మార్కెట్ కమిటీకి ఎలాంటి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా జవహర్ నగర్ లో మార్కెట్ నిర్మాణం చేయడం వెనుక కారణాలు ఏమిటి అనే అంశంపై మంత్రి మల్లారెడ్డి కలెక్టర్ శ్వేతా మహంతి అంతర్గతంగా విచారణ జరిపి వందల మంది వద్ద 30 వేలకు పైగా వసూలు చేసి మార్కెట్లో స్థలాలు కేటాయించనీ బాధితులకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *