TT Ads

చిత్తూరు జిల్లాలో ని కెవిబిపురం మండలం లో ఎస్ ఎల్ పురం సమీపంలో ని అటవీ ప్రాంతంలో డంప్ చేసిన ఎర్రచందనం దుంగలు, వాటిలో కొన్ని రవాణా చేస్తుండగా మొత్తం 138 ఎర్ర చందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం రేంజ్ డిఐజి కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు ఆర్ ఐ కృపానంద టీమ్ గత రెండు రోజులు గా ఈ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారని డీఎస్పీ కేసి వెంకటయ్య తెలిపారు. ఆయన డీఎస్పీలు గిరిధర్, మురళీధర్ లతో కలసి సంఘటన స్థలానికి చేరుకొని, అక్కడ విలేకరులతో మాట్లాడారు. ఎత్తైన కొండ ప్రాంతంలో దాచి ఉంచిన ఎర్రచందనం దుంగలను గుర్తించారని తెలిపారు. వాటిలో కొన్నింటిని రవాణా చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. రవాణా కు ప్రయత్నం చేస్తున్న స్మగ్లర్ల మేస్ట్రీ, ఎస్ ఎల్ పురం ఎస్ టి కాలనీకి చెందిన చెంబయ్యను, అతనికి సహకరిస్తున్న మరో వ్యక్తి చెంగయ్యను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరు అదే ప్రాంతానికి చెందిన వెంకటేష్, ప్రశాంత్ లతో పాటు తమిళనాడు లోని తిరుత్తని కి చెందిన కూలీలను తెచ్చుకుని, వారితో గత రెండు నెలలుగా ఎర్రచందనం దుంగలను సేకరించి నట్లు తెలిపారు. వీరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.. వీటి బరువు రెండున్నర టన్ను లు ఉంటుందని తెలిపారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న వారికి రివార్డులకు సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు. సంఘటన స్థలానికి ఆర్ ఎస్ ఐ లు లక్ష్మణ్, లింగాధర్, ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్, కెవిబి పురం ఎస్ ఐ గోపి చేరు కున్నారు. టాస్క్ ఫోర్స్ సి ఐ వెంకట్ రవి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *