TT Ads

కృష్ణాజిల్లా ఘంటసాల మండల పరిధిలోని పాపవినాశనం గ్రామంలో పోలీసులు బుధవారం పేకాట శిబిరంపై మెరుపుదాడి చేశారు. ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ టి.రామకృష్ణ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.4100 నగదు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు చెప్పారు. ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతూ.కోడిపందాలు, పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపద్యంలో ప్రజలు సామాజికష దూరం పాటించాలన్నారు. జనం గుమ్మికూడి ఉండటం వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *