TT Ads

దేశానికి దశ, దిశ చేకూర్చే విధంగా రాజ్యాంగ రచన చేసి ఒక దిక్సూచిగా మారారని ఆయన పేర్కొన్నారు.భారత రత్న, భారత రాజ్యాంగ రూప శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ 130వ జయంతి సందర్బంగా ఏలూరు పాత బస్టాండ్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు.

ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ చీకట్లో మగ్గుతున్న అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన డాక్టర్ అంబేడ్కర్ వేగుచుక్క గా నిలిచారన్నారు.అంగారిన వర్గాలకు చదువే ఆయుధం అని ప్రబోధం చేసి సమానత్వాన్ని తీసుకు వచ్చిన అంబేడ్కర్ వంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు.బాల్యంలోనే అనేక బాధలను, అవమానాలకు గురియై బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషితో స్వీయప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్రమంత్రి పదవిని అలంకరించిన మహామనీషి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్

మహారాష్ట్రంలోని రత్నగిరి జిల్లాలో, మందన్‌గాడ్ పట్టణానికి దగ్గరున్న అంబావాడే గ్రామంలో మెహర్ కులానికి చెందిన, రాంజీ సక్‌పాల్, భీమాబాయి దంపతుల 14వ సంతానంగా 1891 ఏప్రిల్ 14న జన్మించాడు.భీమ్‌రావ్ ఎల్‌ఫిన్‌స్టన్ హైస్కూల్ లో చేరి మెట్రిక్యులేషన్ పాసయ్యాడు, సంస్కృతం చదువు కోవాలని ఆశించాడు, కులం అడ్డు వచ్చింది. ఇష్టంలేకున్నా పర్షియన్ భాష చదివారు.

16వ ఏటనే పెద్దలు అతనికి పెళ్ళి చేశారు .బరోడా మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బి.ఏ. పరీక్షల్లో పాసయ్యారు .చదువులు చదవాలన్న పట్టుదలవల్ల ఉద్యోగంలో చేరలేదు, మహారాజుకు తన కోరికను తెలిపారు, విదేశంలో చదువుపూర్తిచేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్లు పనిచేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయం చేరాడు, 1915లో ఎం.ఏ. 1916లో పి.హెచ్.డి. డిగ్రీలను సంపాదించారు

1917 లో డాక్టర్ అంబేద్కర్‍గా స్వదేశం వచ్చారు.32 సంవత్సరాల వయసులో డా.అంబేద్కర్, బార్-అట్-లా, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి పట్టాలను పొందారు.

1927లో మహద్‍లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర గుజరాత్‍ల నుండి కొన్ని వేలమంది వచ్చి మహద్ చెరువులోని నీటిని త్రాగుటకు వీలు లేదు అంటరానివారికి ఆ చెరువులో ప్రవేశం లేదు అంబేద్కర్ నాయ కత్వంలో వేలాదిమంది చెరువు నీరు స్వీకరించారు. ఈ సంఘటన మహారాష్ట్రంలో సంచలనం కలిగించిందని.1927లో అంబేద్కర్ ‘బహిష్కృత భారతి’ అనే మరాఠి పక్ష పత్రిక ప్రారంభించారు – మంత్రి ఆళ్ల నాని గారు.అంబేద్కర్ పెక్కు గ్రంథాలు వ్రాశాడు. ‘ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ’, ‘ప్రొవిన్షియల్ డీ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటీష్ ఇండియా’, ‘ది బుద్దా అండ్ కార్ల్ మార్క్స్’, ‘ది బుద్ధా అండ్ హిజ్ ధర్మ’ ప్రధానమైనవి.

కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా వుండి 1951 అక్టోబర్ లో మంత్రి పదవికి రాజీనామా చేశాడు. 1956 అక్టోబర్ 14న నాగ్ పూర్ లో అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించారు – మంత్రి ఆళ్ల నాని గారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు హిమాన్షు శుక్ల, నంబూరు తేజ్ భరత్, దళిత నాయకులు నూక పెయ్యి సుధీర్ బాబు, మున్నుల జాన్ గురునాథ్, జయకర్, బండారు కిరణ్, జగదీష్, పొలిమేర హరికృష్ణ, మట్ట రాజు, పళ్లెం ప్రసాద్, వైయస్సార్ సిపి నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, మేయర్ అభ్యర్థి నూర్జహాన్ పెదబాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మంచం మై బాబు , ఎం ఆర్ డి బలరాం, బుద్దని శ్రీనివాస్, గుడిదేశి శ్రీనివాస్, నెరుసు చిరంజీవి, మామిళ్ళపల్లి జయప్రకాష్, దిరిశాల వరప్రసాద్, కిలాడి దుర్గారావు తదితర వైఎస్ఆర్సిపి నాయకులు, దళితులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *