TT Ads

ప్రకాశం: కురిచేడులో ఓ కంత్రీ వలంటీర్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక ఎస్సై, పంచాయతీ కార్యదర్శి సీట్లలో కూర్చుని ఫోటోలకు ఫోజులిస్తున్నాడు. ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కురిచేడులో వలంటీర్‌గా పనిచేస్తున్న అలహరి అఖిల్.. గతంలో కూడా పలు కేసులలో నిందితుడిగా ఉన్నాడు. విధుల నిర్వహణ నిమిత్తం ఆయా కార్యాలయాలకు వెళ్లిన సమయంలో ఉన్నతాధికారుల సీట్లలో కూర్చుని ఫోటోలకు ఫోజులిచ్చాడు. 2018లో రాజమండ్రిలో ఓ మహిళతో కలిసి సబ్ కలెక్టర్ పేరుతో బంగారు షాపు వారిని బురిడీ కొట్టించే యత్నం చేశాడు. షాపు సిబ్బంది అనుమానించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మోసం బట్టబయలైంది. ఆ సమయంలో సదరు వలంటీర్‌పై కేసు కూడా నమోదైంది. కురిచేడు లోను బ్యాంక్ యాప్ ద్వారా ఓ మహిళ ఖాతా నుంచి 2.50 లక్షల నగదును అఖిల్ మాయం చేశాడు. పలువురి వద్ద రేషన్ కార్డులు ఇప్పిస్తామంటూ భారీగా నగదును అఖిల్ వసూలు చేశాడు. అఖిల్ వ్యవహారాలపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *