TT Ads

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో బీఆర్కే భవన్‎లో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక అంశాలకు సంబంధించి అధికారుల నుంచి వివరాలను సోమేశ్ సేకరిస్తున్నారు.

అధికారులతో సమావేశం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్‎తో సీఎస్ భేటీ కానున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ విధించే ఆలోచనపై సీఎంతో కీలకంగా చర్చించనున్నట్లు సమాచారం.

అంతేకాకుండా పంట కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారి ద్వారా వైరస్ వ్యాప్తి జరగకుండా ఉండే జాగ్రత్తలపై సీఎం దృష్టికి సీఎస్ తీసుకెళ్లనున్నారు.

మరోవైపు.దేవాలయాల వద్ద రద్దీ, ఆలయాల్లో కరోనా పెరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్‎తో సీఎస్ వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. రంజాన్ మాసం నేపథ్యంలో కరోనా కట్టడిపై అప్రతమత్తత ఉండేలా సూచనలు తీసుకోనున్నారు. కేసీఆర్‌తో భేటీ అనంతరం సీఎస్ కీలక ప్రకటన చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి మొత్తానికి చూస్తే ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో నైట్ కర్ఫ్యూ విధించాలా? వద్దా? అనేదానిపై క్లారిటీ రానుంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *