TT Ads

పంటకాలువలు, మురుగు కాలువల ప్రవాహానికి ఆటంకం లేకుండా పిచ్చి చెట్లు, బుడగ తామర , గుర్రపు డెక్క ఇతర అనవసర మెుక్కలు తొలగించి శుభ్రం చేయడం ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు సక్రమంగా అందించవచ్చని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు.

సోమవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్ద ప్రజల నుంచి పలు వినతులు స్వీకరించారు. తొలుత ఎన్. గొల్లపాలెం గ్రామనికి చెందిన మాజీ సర్పంచ్ జడ్డు వడ్డికాసులు మంత్రి పేర్ని నానిని కలిశారు. మంగల్లంక కోడు మురుగు కాలువ పూడికతీత పనులు భోగిరెడ్డిపల్లె నుంచి తవ్వుకొచ్చి సరిగ్గా ఎన్. గొల్లపాలెం గ్రామం వద్ద పనులు నిలిపివేశారని ఆ కాలువ మాములుగా అయితే కె పి టీ పాలెం వరకు వెళ్తుందని , కాలువలో నీళ్లు ఉన్నందున పూడిక పనులు ఆగిపోవడంతో గత ఏడాది మాదిరిగా మడులు మునిగిపోయే ప్రమాదం ఉందని, కనీసం 5 వ నెంబర్ కాలువ వరకు ఐనా పూడిక తీయించమని, దాళ్వా ఇచ్చారని సీజన్ అయిపోతుందని కాలువ పూడిక తీయకపోతే సకాలంలో వరినాట్లు వేయలేమని కనీసం మూడు ఫర్లాంగుల దూరం మెషిన్ తో తవ్వించాలని వడ్డికాసులు అభ్యర్ధించారు. ఈ విషయమై మంత్రి స్పందిస్తూ, నీరు కాలువలో ఉన్నందున బురదలో ప్రొక్లైన్ బకెట్ తూ తూ మంత్రంగా పూడిక తీస్తూ మోసకరమైన పనులు చేయడం తగదు కదా ? కాలువలో అడ్డుకట్ట నిర్మించి ఎండకట్టి ఆపై పూడిక దర్మం కదా అని చెప్పారు. మీ ప్రాంత సమీపంలో కాలువలో విచ్చలవిడిగా పెరిగిన తూటుకాడ, నవారుగడ్డి తొలిగించే విధంగా జంగిల్ క్లీయరెన్సు చేయిస్తానని జడ్డు వడ్డికాసులకు మంత్రి చెప్పారు.


స్థానిక నిజాంపేటలోని శ్రీ విన్నకోట బాలకోటయ్య గారి తొట లో 1918 లో వెలసిన శ్రీ విజయ వనమలమ్మ అమ్మవారి ఆలయాన్ని బ్రహ్మశ్రీ విష్ణుభొట్ల సూర్యనారాయణ శర్మ ఘనాపాటి గారి ఆధ్వర్యంలో పునర్నిర్మాణ సంకల్పానికి ఆలయ పెద్దలు మరియు భక్త బృందం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు పేర్ని వెంకట్రామయ్య (నాని) గారి కార్యాలయం వద్ద కలిశారు. గౌరవ మంత్రివర్యులు శ్రీ విజయ వనమలమ్మ అమ్మవారి మహత్యాన్ని తెలిపే పునర్నిర్మాణ పత్రికను ఆవిష్కరించారు. ఆలయ పెద్దలు మాట్లాడుతూ 1918 లో ఆనాటి గ్రామపెద్దల సంకల్పంతో శ్రీ విజయ వనమలమ్మ అమ్మవారు వెలిసిందని,గత 104 సంవత్సరాలుగా నిత్యపూజలతో వార్షిక జాతర ఉత్సవాలతో అమ్మవారి వైభోగం వర్ణనాతీతం అని తెలిపారు. ఈ పునర్నిర్మాణ సంకల్పానికి గౌరవ మంత్రివర్యుల ఆశీస్సులు మరియు అభినందనలు లభించడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయపెద్దలు విన్నకోట రామ మోహన్ రావు గారు,స్థానిక 14వ వార్డు కార్పొరేటర్ శైలజ గారు మరియు స్థానిక పుర ప్రముఖులు, అమ్మవారి భక్తులు పాల్గొన్నారు.స్థానిక మాచవరం మెట్టు ప్రాంతానికి చెందిన సింగంశెట్టి కావ్య అనే 10 వ తరగతి బాలిక ఆమె బంధువులు మంత్రి పేర్ని నానిని కలిశారు. ఇటీవల కోవిడ్ సోకడంతో తన తండ్రిని కావ్య కోల్పోయిందని ఆమె తల్లి పాప చిన్ననాటి మృతి చెందిందని వారు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆ పాపకు ఆర్ధిక సహాయం వచ్చేలా చేయమని మంత్రిని పాప బంధువులు మంత్రిని అభ్యర్ధించారు.మచిలీపట్నం గిలకలదిండిలో మెరైన్ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ గా ఉద్యోగ బాధ్యతలు నూతనంగా చేపట్టిన వి. జగదీష్ చంద్ర బోస్ మంత్రి పేర్ని నానిని మర్యాదపూర్వకంగా కల్సి పుష్పగుచ్చం, పేద విద్యార్థులకు ఉపయోగపడే నోట్ పుస్తకాలు అందించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *