TT Ads

పొందూరు మండలం : శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం రాపాక అడ్డురోడ్ వద్ద గల శ్రీ రాజ్యలక్ష్మి పోల్స్ పరిశ్రమలో పనిచేస్తున్న లైదాం గ్రామానికి చెందిన లుట్ట.వెంకటరమణ ఇటివలె రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో తోటి కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవడానికి యాజమాన్యంతో రూ.1,60,000/-, పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా విరాళాలు వసూలు చేసి 50,000 రూపాయల మొత్తంగా రూ. 2,10,000/- బుధవారం చనిపోయిన కార్మికుడి భార్య లుట్ట.ఆదిలక్ష్మికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు సి.హెచ్. అమ్మన్నాయుడు శ్రీ రాజ్యలక్ష్మి పవర్ ఇన్ ఫ్రా వర్కర్స్ యూనియన్ నాయకులు పి.అప్పలనాయుడు, కె.గోవిందరావు చేతుల మీదుగా శ్రీకాకుళం సిఐటియు కార్యాలయంలో అందజేశారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *