TT Ads

ఖమ్మం : శనివారం నాడు మామిడిమేళా విక్రయాలను డీడీహెచ్ అనుసూయ గారు సందర్శించి , రైపనింగ్ ఛాంబర్ బిల్లును , మామిడి పండ్లను పరిశీలించారు . అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన కార్బోరహిత మామిడి పండ్లను మాత్రమే విక్రయించాలని సూచించారు . ఆదర్శ రైతు బాణోతు లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ … గత పది సంవత్సరాల నుంచి అమ్మకాలను చేపట్టారని అన్నారు . ఖమ్మంలో మూడు ప్రదేశాల్లో పెవిలియన్ గ్రౌండ్ , ఇల్లందు క్రాస్ రోడ్డు రైతు బజార్ , గాంధీ చౌక్ ఆంజనేయస్వామి విగ్రహం పక్కన మామిడిమేళా విక్రయాలు జరుగుతున్నాయ అని అన్నారు . ప్రస్తుతం అమ్మకాలకు చిన్న రసాలు , పెద్దరసాలు , హిమాయిత్ , కొబ్బరి మామిడి , బంగినపల్లి రకాల మామిడి పండ్లు ఉన్నాయని , ఉగాది తర్వాత నుంచి దశెరి , అల్ ఫన్ సొ, మల్లిక , కెశరి , సువర్ణరేఖ తియ్యటి మామిడి పండ్లు మార్కెట్లోకి అమ్మకాలకు వస్తాయని పేర్కొన్నారు . అలాగే పచ్చిడి మామిడికాయలు తెల్ల గులాబీ , జలాలు , చిన్న రసాలు కూడా వస్తాయని కావాల్సినవారు సంప్రదించాలని కోరారు . పట్టణ ప్రజలకు అతి తక్కువ ధరలకే అమ్మకలను చేపట్టారని కావున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు . ప్రజలు మామిడిమేళాను సందర్శించి మధురమైన తియ్యటి మామిడి పండ్లను కొని ఆస్వాదించాలని తెలియజేశారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *