TT Ads

నేడు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో సేంద్రీయ రైతు బాణోత్ లక్ష్మణ్ నాయక్ పండించిన కార్బైడ్ రహిత మరియు సేంద్రీయ మామిడి పండ్ల దుకాణాన్ని రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వరరావు ప్రారంభించినారు . ముఖ్య అథిదులుగా జిల్లా ఉద్యాన వన శాఖా అధికారి అనసూయ మరియు నగర అసిస్టెంట్ కమీషనర్ మల్లీశ్వరీ గార్లు పాల్గొన్నారు . అనంతరం రైతు బాణోత్ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ ప్రస్తుతం చెరకు రసాలు , బంగినపల్లి , ముంత మామిడి వంటి సేంద్రియ కార్బైడ్ రహిత మామిడి పండ్లను 1kg 100 ధర పలుకుతుందని , ఏప్రిల్ ఫస్టు (1) తారీకు నుండి చిన్న రసం మామిడి , పెద్ద రసం మామిడి , హిమాయత్ మామిడి , నాటు మామిడి , పచ్చిడ మామిడి , మల్లిక మామిడి , దాసేరి మామిడి , సువర్ణరేఖ మామిడి కాయలు వస్తాయని ఈ మామిడి మేళా మార్చి నెల గురువారం నుండి జూన్ నెల వరకు అమ్మకాలు కొనసాగుతాయని పేర్కొన్నారు .గత పది సంవత్సరాల నుండి ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో గోవిందరాల మామిడితోట నుండి తీసుకుని వచ్చి నాణ్యమైన మామిడి కాయలను అతి తక్కువ ధరకే నగర ప్రజలకు అందిస్తున్నారని అన్నారు .ఎటువంటి రసాయన పదార్థాలు వాడకుండా సేంద్రియ ఎరువులతో ఈ మామిడి తోటను పండిస్తున్నట్టు రైతు లక్ష్మణ్ తెలిపారు .

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *