TT Ads

యాంకర్ : డబుల్‌ బెడ్రూం ఇళ్ళు ఇప్పిస్తానని ఓ మహిళ నుండి డబ్బులు తీసుకుని, ఆమె నిలదీయటంతో నీ ఫోటోలు వీడియోలు వైరల్ చేస్తానంటూ బెదిరించిన ఓ కార్పోరేటర్ అనుచరుడి పై బాధిత మహిళ కార్పోరేటర్ కార్యాలయంలోనే నిందితుడిని చెప్పుతో కొట్టిన సంఘటన బాలానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్ పరిధిలోని గౌతమీ నగర్ లో ఉండే సయ్యద్ అహ్మద్ బాలానగర్ కార్పోరేటర్ అనుచరుడిగా ఉంటున్నాడు. ఫిరోజ్ గూడకు చెందిన ఓ వివాహితతో అహ్మద్ కు పరిచయం ఏర్పడి వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆ మహిళకు డబుల్‌ బెడ్ రూం ఇల్లు ఇప్పిస్తానని అహ్మద్, ఆమె‌ నుండి పది లక్షల రూపాయలు తీసుకున్నాడు. డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వకపోవటంతో, డబ్బులు తిరిగి ఇవ్వకపోవటంతో ఆ మహిళ అహ్మద్ ను నిలదీసింది. శనివారం కార్పోరేటర్ కార్యాలయం వద్దకు వచ్చిన బాధితురాలు మరోసారి అహ్మద్ ను నిలదీయటంతో ఆమె తనతో ఉన్న ఫోటోలను వీడియోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె అతడిని చెప్పుతో కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి పై చీటింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *