TT Ads

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ పరిథిలోని జోసిల్ కంపెనీ వద్ద కొద్దిసేపటి క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కార్ డ్రైవర్ నిర్లక్ష్యానికి తల్లి, తండ్రి, కొడుకు ముగ్గురు విగత జీవులు గా మారారు. అయితే కార్ డ్రైవర్ మాత్రం పోలీసుల వద్ద దాన్ని స్వల్ప ప్రమాదం గా చిత్రీకరించి అక్కడ నుండి ఉడాయించాడు.వివరాల్లోకి వెళితే 113 తాళ్ళూ రుకు చెందిన షేక్.చిన్న హుసేన్ (50), షేక్.నూర్జహా (45), షేక్ హుస్సేన్ (25) లు ద్విచక్రవాహనంపై అమరావతి లోని ఓ గుడిలో నిద్ర చేసేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో AP 07 TV 1229 నెంబర్ గల కారు జోసిల్ కంపెనీ వద్ద ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వాహనాన్ని ఢీ కొట్టి పారిపోతున్న కారుని స్థానికులు అడ్డుకున్నారు. అప్పటికీ సంఘటన స్థలానికి చేరుకోని పోలీసుల వద్దకు కారు డ్రైవర్ వెళ్ళి….దాన్ని స్వల్ప ప్రమాదంగా చిత్రీకరించి అక్కడ నుండి జారుకున్నారు.మృతిచెందిన వారిని పోస్ట్ మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని మార్చురీకి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు అక్కడకి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *