TT Ads

ఖమ్మం: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, రాష్ట్ర అధికార ప్రతినిధి గా, ఖమ్మం రూరల్ మండలం గోళ్ళపాడు గ్రామానికి చెందిన, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు, పాలేరు నియోజకవర్గ ముద్దుబిడ్డ, ప్రముఖ న్యాయవాది, ఉన్నత విద్యావంతుడు, అంబేద్కర్ వాది, డా౹౹మద్ది శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ, ఆ మేరకు నియామక ఉత్తర్వులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ కెప్టెన్ ఉత్తంకుమార్ రెడ్డి జారీ చేశారు. మద్ది, తన 8వ తరగతి నుంచి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం నాయకుడిగా, 1997లో ఖమ్మం రూరల్ మండల NSUI అధ్యక్షుడిగా పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ లో తెలంగాణ మలిదశ ఉద్యమాలలో పాల్గొన్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి., ఎల్. ఎల్. ఎం (గోల్డ్ మెడలిస్ట్), పీహెచ్డీ చేశారు, చదువుకునే సమయంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారు. తన తాతగారి నుంచి నేటి వరకు ఆయన కుటుంబం కాంగ్రెస్ పార్టీలో నే కొనసాగుతున్నారు. ఉన్నత పాఠశాల విద్యార్థి దశ నుంచి దాదాపు ముప్పై రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2009 & 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కీర్తిశేషులు రాంరెడ్డి వెంకటరెడ్డి గారి వెంట ఉండి, ఆయన గెలుపు కోసం ఎంతో కృషి చేశారు. 2010లో ఉమ్మడి ఖమ్మం జిల్లా లీగల్ మరియు మానవ హక్కుల విభాగం జిల్లా కన్వీనర్ గా ఉన్నారు. పాలేరు నియోజకవర్గంలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరికీ ఎలాంటి ఆపద వచ్చినా, తన వంతుగా సహకరించేవారు, నాటి నుంచి నేటి వరకు పార్టీకి వీర విధేయుడిగా పనిచేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా, 2021లో ఖమ్మం-నల్గొండ -వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టిక్కెట్ కోసం రాష్ట్ర అధిష్టానం, ఢిల్లీ అధిష్టానం మద్ది శ్రీనివాస రెడ్డి పేరును బలంగా పరిగణించినప్పటికీ, కొన్ని సమీకరణాల వల్ల టికెట్ రాకపోయినా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పని చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ , యువ నాయకులు రాహుల్ గాంధీ, పిసిసి అధిష్టానం, నన్ను గుర్తించి రాష్ట్ర అధికార ప్రతినిధి గా నియమించడం జరిగింది. నా మీద ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ఉత్తంకుమార్ రెడ్డి గారికి, సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క గారికి, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు రేణుకా చౌదరి గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి, మధు యాష్కీ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోవు 2023 ఎన్నికలలో పాలేరు నియోజకవర్గంతో పాటు, ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగర వేస్తామని తెలియజేశారు. మద్ది నియామకం పట్ల ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమములో పోటు అభిలాష్ చౌదరి, SC సెల్ నాయకులు వెల్తూరి వీరా కుమార్, సిరిగద్దె రాజేష్, ఉమా మహేశ్వర గుప్త, రైతు విభాగం జిల్లా నాయకులు మద్ది గంగి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *