TT Ads

కల్లూరు మండలం, కల్లూరులోని జరిగిన కార్యక్రమంలో అంగన్ వాడి, ఆశ వర్కర్స్ కి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కరోనా సమయంలో వారి సేవలు అభినందనీయం అని, ప్రతి సంవత్సరం మహిళ దినోత్సవం ఘనంగా నిర్వహించి, మహిళలను సత్కరించే వారమని, ఎన్నికల నిబంధలనుసారం ఈ సారి ఈ కార్యక్రమాన్ని చేపట్టలేకపోయామని అన్నారు. మార్చి 14 న జరగనున్న పట్టభద్రుల ఎన్నికలలో బ్యాలెట్ లోని 3వ వరస సంఖ్యలోని టి.ఆర్.యస్ పార్టీ అభ్యర్థి డా.పల్లా. రాజేశ్వర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత(1) ఓటు వేసి వారి గెలుపులో భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని పోలింగ్ శాతాన్ని పెంచాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *