TT Ads

అమరావతి: కర్నూలు సీఐడీ డీఎస్పీ జారీ చేసిన నోటీసుకు మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రత్యుత్తరమిచ్చారు. విచారణకు వచ్చేందుకు మరో 10 రోజులు సమయం కావాలన్నారు.విచారణకు హాజరు కావడం ఇప్పుడు సాధ్యంకాదంటూ.. తనకు నోటీసులు జారీ చేసిన కర్నూలు సీఐడీ డీఎస్పీకి మాజీమంత్రి దేవినేని ఉమా ప్రత్యుత్తరం పంపారు.విజయవాడ గొల్లపూడిలోని తన నివాసానికి ఉదయం 10.20కి నోటీసులు అంటించి 10.30కి కర్నూలు రమ్మనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.పార్టీ ఆదేశాల మేరకు తిరుపతి ఉపఎన్నికల ప్రచారం కోసం నెల్లూరులో ఉన్నట్లు ఉమా లేఖలో పేర్కొన్నారు.కరోనా నివారణ చర్యల్లో భాగంగా,విచారణకు హాజరయ్యేందుకు మరో 10 రోజుల సమయం కావాలని కోరారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *