TT Ads

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గురువారం కరోనా వ్యాక్సిన్‌ తీసుకోనున్నారు. గుంటూరు అమరావతి రోడ్డులోని భారతపేట 140వ వార్డు సచివాలయంలో ఉదయం 11 గంటల సమయంలో ఆయన టీకా వేయించుకుంటారు. 45 ఏళ్ల దాటిన వారికి దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం లేకుండా ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్‌ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో.. రాష్ట్రంలో ప్రప్రథమంగా సీఎం జగన్‌ ఆ కేటిగిరి కింద వ్యాక్సిన్‌ తీసుకోనున్నారు. ఆయనకు కొవాగ్జిన్‌ టీకా వేసేందుకు జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతకంటే ముందు సీఎం ఇక్కడి నుంచే గ్రామ/వార్డు సచివాలయాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియని లాంఛనంగా ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లని బుధవారం హోంమంత్రి మేకతోటి సుచరిత, సీఎం సెక్యూరిటీ అధికారులు పరిశీలించారు. కాగా.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలో జరిగే మేయర్లు, డిప్యూటీ మేయర్లు, పురపాలక చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఓరియెంటేషన్‌ కార్యక్రమంలో పాల్గొంటారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *