TT Ads

కరోనా సెకండ్ వేవ్ ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో కరోనా నిర్ధారణకు మొబైల్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత నెలకొని ఉంది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కృష్ణ జిల్లా, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలపై కరోనా నివారణకు ప్రత్యేకంగా దృష్టి పెట్టిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు మొబైల్ కేంద్రాల విస్తృత ఏర్పాట్లకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మొబైల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి

గత ఏడాది మంత్రి ఆళ్ల నాని రాష్ట్రంలోని వివిధ నగరాలతో పాటు విజయవాడ నగరంలోని పలుచోట్ల కూడా ఈ మొబైల్ కేంద్రాలను ఏర్పాటు చేసి కరోనా పరీక్షలు చేసి ఎంతో మందికి చైతన్యాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ కరోనా పరీక్ష కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అర్దం కాక చాలామంది పలు ఇబ్బందులు పడుతూ ఆందోళనకు గురవుతున్నారు.
అందుకుగాను ఏరోజు ఎక్కడ ఈ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారో తెలియపర్చాలని ప్రజలు కోరుకుంటున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *