TT Ads

కరోనా దేశంలో రాజకీయ విభేదాలను అంతం చేసిందని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. కరోనా పరిస్ధితిపైని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సోనియా సమీక్ష నిర్వహించారు. దేశమంతా ఒక్కటై మహమ్మారిపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో కరోనా ఉధృతితో తలెత్తిన పరిస్ధితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమండ్‌ చేశారు.

ప్రస్తుత పరిస్ధితిని ఎదుర్కోవాల్సిన తీరుపై లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యుల సోనియా నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. కరోనాపై పోరాటం కోసం పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలపై కూడా సోనియా సమీక్ష జరిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ చూపిన పని తీరు నిరాశాజనకంగా ఉందని అన్నారు. ఎన్నికల ఫలితాలపై సీడ్ల్యూసీ త్వరలోనే మరోసారి సమావేశమై సమీక్ష జరుపుతుందని సోనియా కాంగ్రెస్‌ ఎంపీలకు తెలిపారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *