TT Ads

కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా విస్తరిస్తూ,విజృంభిస్తున్నది.అనేక కుటుంబాలలో విషాదాన్ని నింపుతున్నది.తిరుపతిలోనూ రోజు రోజుకూ కోవిడ్ పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి.ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు,పెన్షనర్లు కరోనా తో మృతి చెందడం జరిగింది.ఇప్పటికీ పదుల సంఖ్యలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మరికొంతమంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు.మొదటి సారి కరోనా కాలంలో టీటీడీ యాజమాన్యం ఉద్యోగులకు భరోసా ఇచ్చిన విధంగానే సెకండ్ వేవ్ కరోనా లోనూ ఉద్యోగులకు అండగా ఉండాలని ఆశిస్తున్నాం.

తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు.వీరికి సేవలందించే ఉద్యోగులు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరంఉంది.తిరుమల వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా,ఉద్యోగులరక్షణ దృష్టిలో ఉంచుకొని “వర్క్ ప్రంహోం”చేయగలిగిన వారికి ఇచ్చి,మిగిలిన వారికి 50:50నిష్పత్తిలో విధులు కేటాయించాలని,అలాగే గతంలోలాగే టిటిడి ఉద్యోగులకు ప్రత్యేకంగా శ్రీనివాసం నందు “కోవిడ్ ఐసోలేషన్”సెంటర్ ను ప్రారంభించాలని టిటిడి ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు గంపల వెంకటరణారెడ్డి,గోల్కొండ వెంకటేశం,మేడికొండ ప్రసాదరావు,మల్లారపు నాగార్జున,జాటోత్ భాస్కర్,K.ఇందిర,సానంరెడ్డికల్పన,కాటా గుణశేఖర్,అమాస నాగరత్నం,V.వెంకటరమణ,కొమ్మారెడ్డెప్ప,ఆదిలక్ష్మితదితరులు టిటిడి యాజమాన్యాన్ని కోరుతున్నరు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *