TT Ads

మండలంలోని పొన్నెకల్లు గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు కోటి అమరయ్య(73) కరోనాతో పోరాడుతూ గురువారం ఉదయం మృతి చెందారు.కోటి అమరయ్య మృతదేహాన్ని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సందర్శించి మృతదేహంపై ఎర్ర జెండా కప్పి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో తమ్మినేని మాట్లాడుతూ పోన్నెకల్లు గ్రామంలో పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన నాయకుడు అమరయ్య అన్నారు.అమరయ్య తన జీవితాంతం పేదల పక్షపాతిగా ఉన్నాడని తెలిపారు.ఎర్రజెండా పట్ల నిబద్ధత కలిగిన నాయకుడని,పట్టిన జెండాను చివరి వరకు మోసిన మార్క్సిస్టు బిడ్డ కోటి అమరయ్య అన్నారు.ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన ఎర్రజెండా ను విడిచి పెట్టలేదన్నారు.పొన్నెకల్లు యువత అమరయ్య ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.వారం రోజుల వ్యవధిలోనే అమరయ్య దంపతులు మృతి చెందడం చాలా విషాదకరం అన్నారు.అమరయ్య కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.మృతునికి ఇద్దరు కుమారులు,కుమార్తె ఉన్నారు…

పది రోజుల వ్యవధిలో కరోనాతో దంపతులు మృతి.అమరయ్య సతీమణి అచ్చమ్మ ఈనెల 1వ తేదీన కరోనాతో మృతి చెందారు. పది రోజుల వ్యవధిలోనే తల్లిని,తండ్రిని కోల్పోయిన అమరయ్య కుమారులు, కుమార్తె రోధిస్తున్న తీరు పలువురిని కంట తడి పెట్టించింది.దంపతులిద్దరు పది రోజులు వ్యవధిలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.అమరయ్య కోవిడ్ తో మృతిచెందిన కూడా సీపీఎం నాయకులు, కార్యకర్తలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమరయ్య అంతిమయాత్రలో అశేష జనవాహిని పాల్గొన్నారు.దారిపొడవునా జోహార్ కామ్రేడ్ అమరయ్య అంటూ నినాదాలతో అంతిమ యాత్ర ముంగించారు.అమరయ్య మృత దేహాన్ని సందర్శించి నివాలర్పించిన వారిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు,జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్,మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, మండల నాయకులు బత్తినేని వెంకటేశ్వరరావు, బందెల వెంకయ్య,పెరుమళ్ళపల్లి మోహన్ రావు,నందిగామ కృష్ణ,ఏటుకూరి ప్రసాద్ రావు,తమ్మినేని కోటేశ్వరరావు,సిద్దినేని కోటయ్య,యామిని ఉపేందర్,వరగాని మోహన్ రావు,గుర్రం మల్సూర్,కిరణ్,డాక్టర్ రంగారావు,పొన్నెకల్లు సర్పంచ్ తాటికొండ సుదర్శన్ రావు,ఐద్వా నాయకురాళ్లు బుగ్గవీటి సరళ,మాచర్ల భారతి,బండి పద్మ,మెరుగు రమణ,పొన్నెకల్లు, మద్దులపల్లి,తెల్దారు పల్లి,తల్లంపాడు గ్రామ శాఖ సభ్యులు తదితరులు నివాళులర్పించారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *