TT Ads

లిబర్టీ స్టీల్’ ఆర్థిక పరిస్థితి సరిగా లేదు,లిబర్టీ స్టీల్’తో ఎంవోయూ జరగలేదు. కేవలం చర్చలు, ప్రతిపాదనలు మాత్రమే.ప్లాన్ -బీని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధం,ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమలో స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వమే చేపడుతుంది, పూర్తి చేస్తుంది.ఆదాయం కోసం మాత్రమే కాకుండా ప్రజల భావోద్వేగాలు, సామాజిక బాధ్యతతో పని చేసే ప్రభుత్వం మాది,సగటు మనిషికి ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ అవసరం.అందుకే ఉచిత ఇంటర్నెట్ అందించడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని ప్రభుత్వం ముందుకొచ్చిందని ఉదాహరణగా వివరించిన మంత్రి మేకపాటి కేంద్ర ప్రభుత్వం హక్కుగా ఇవ్వాల్సినవి ఇవ్వనపుడు ఆ బాధ్యత నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యతనేది మా భావన.

నిన్న మౌలికసదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ విడుదల చేసిన జీ.వో.ఆర్.టీ నంబర్.13 కు సాధారణంగా జరిగే ప్రక్రియలో భాగం కేవలం వర్క్ షాప్ నిర్వహణ కోసం నోడల్ ఏజెన్సీ ఏర్పాటుకు సంబంధించిన సాధారణ విషయం.పార్లమెంట్ ఆమోదం, కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకారం నోడల్ ఏజెన్సీ ఏర్పాటుకు రాష్ట్రం సహకరిస్తుంది.జీ.వో ఇచ్చినంత మాత్రాన పెట్టుబడుల ఉపసంహరణకు, ప్రైవేటీకరణకు ఒప్పుకున్నట్లు కాదు.పరిశ్రమల శాఖపై సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా మంత్రి కామెంట్స్,ఉపాధి, ఆదాయం, ఉత్పత్తిని బట్టే ప్రోత్సాహకాలు : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.

ప్రతి రూపాయికి పారదర్శకత, జవాబుదారీ అవసరంప్రోత్సాహకాల చెల్లింపులో ఎక్కువ ఆలస్యం అవకుండా చర్యలు తీసుకోవాలికచ్చితంగా ప్రతి సంవత్సరం కనీసం కట్టవలసిన ప్రోత్సాహకాల మొత్తం చెల్లించేలా పరిశ్రమల శాఖకు మంత్రి మేకపాటి మార్గనిర్దేశం,ప్రోత్సాహక బకాయిలు పేరుకుపోకూడదు..చెల్లింపులు ఆలస్యం అవకూడదు : మంత్రి మేకపాటి గడువు, నిబంధనలతో జిల్లాలోని పరిశ్రమల శాఖ అధికారుల ఆధ్వర్యంలో మరింత నిఘా.

సచివాలయంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన పరిశ్రమల శాఖపై ప్రారంభమైన సమీక్ష పరిశ్రమలకు ప్రోత్సహకాల గురించి సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గౌతమ్ రెడ్డి చర్చ పరిశ్రమలకు ప్రోత్సాహకాలను చెల్లించకుండా గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినట్లుగా మన ప్రభుత్వ హయాంలో జరగకూడదనే ముఖ్యమంత్రి ఆదేశాలను ఆచరణలో పెట్టాలన్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

మంజూరు కావలసిన, విడుదల చేయవలసిన ప్రోత్సాహకాల గురించి మంత్రి ఆరా,సీఎఫ్ఎమ్ఎస్ లో పెండింగ్ ఉన్న బిల్లుల గురించి మంత్రి మేకపాటికి వివరించిన పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రమణ్యం జవ్వాది,2014 నుంచి 2021 వరకూ 3,586 పరిశ్రమలకు చెల్లించిన ప్రోత్సాహకాలనూ ఆరా తీసిన మంత్రి,గత 7 సంవత్సరాలకు గానూ ప్రభుత్వం చెల్లించివలసిన ప్రోత్సాహకాలు రూ.4,103.25 కోట్లు.నేటి ప్రోత్సహకాలే రేపటి పెట్టుబడులుగా మలచాలి.

భారీ పరిశ్రమలకు అందించే ప్రోత్సాహకాల వివరాలను మంత్రికి అందించిన పరిశ్రమల శాఖచెల్లింపుల ప్రక్రియ అంతా ఆన్ లైన్ ద్వారా కనుక బ్యాంక్ అకౌంట్ వివరాల సహా అన్నింటిపైనా మరింత పరిశీలన, నిఘావిద్యుత్ బిల్లులను ప్రామాణికంగా తీసుకుంటే మరింత పారదర్శకత, నిఘాగత ప్రభుత్వం హాయం పారిశ్రామిక రాయితీలు సకాలంలో చెల్లించలేదు 2014 నుంచి 2019 కాలంలో మొత్తం 27,265 క్లెయింలు పెండింగ్‌లో పెట్టింది ఈ క్లెయిమ్‌ల విలువ రూ.3,883.69 కోట్లు దనివల్ల రాస్ట్ర పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది.

మన హయంలో అటువంటి పరిస్థితి రాకూడదనే ముఖ్యమంత్రి ప్రతిసారీ చెప్పే మాట, ఆదేశంఅందుకే గత ప్రభుత్వ బకాయిలను కూడా వరుసగా విడతలుగా చెల్లిస్తున్నాంగత ప్రభుత్వ బకాయిలు, ప్రస్తుత ప్రభుత్వ బకాయిలు కలుపుకుంటే మొత్తం 43,884 క్లెయింలకు రూ.4,923 కోట్లు చెల్లించాలిఇప్పటకే ఎంఎస్‌ఎంఈలకు రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద చెల్లించాంఈ ఏడాది ఆగస్టులో టెక్స్‌టైల్‌ బకాయిలు చెల్లించడానికి ప్రణాళిక సిద్ధం చేశాంసకాలంలో రాయితీలు చెల్లించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి దీనికోసం ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి కొత్త టెక్స్ టైల్ పాలసీ డ్రాఫ్ట్ ని కూడా వచ్చే కేబినెట్ కి తీసుకురావాలి.

ఖజానాలో డబ్బులు లేకపోయినా ప్రభుత్వం పరిశ్రమల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాధాన్యతా క్రమంలో పాత బకాయిలు చెల్లించే విధంగా క్యాలండర్‌ సిద్ధం చేశాం ప్రతి ఆరు నెలలకోసారి పరిశ్రమలను పర్యవేక్షిస్తోన్నట్లు మంత్రికి పరిశ్రమల శాఖ డైరెక్టర్ వెల్లడి

ఈ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రమణ్యం జవ్వాది, పరిశ్రమల శాఖ అడిషనల్ డైరెక్టర్ వీ.ఆర్.వీ.ఆర్. నాయక్, జాయింట్ డైరెక్టర్ విజయ్ రత్నం, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్ తదితరులు హాజరయ్యారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *