TT Ads

విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పాత కక్షల నేఫథ్యంలో ఓ వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని దారుణంగా హతమార్చాడు. చిన్నారులను సైతం అతడు వదలలేదు. వివరాళ్లోకెళితే.. పెందుర్తి మండలం జుత్తాడలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ తీవ్ర విషాదానికి దారి తీసింది. బత్తిన అప్పలరాజు అనే వ్యక్తి.. అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న రమణ కుటుంబంపై దాడికి దిగాడు. కుటుంబంలోని ఆరుగురిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. మృతుల్లో నలుగురు పెద్దలు, మూడేళ్ల పాప, ఐదు నెలల పసికందు ఉన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. మృతిచెందిన వారిని రమణ(63), రమాదేవి(53), ఉషారాణి(35), అరుణ(37), ఉదయ్ (2), ఉర్విష(6 నెలలు) లు గుర్తించారు.చుట్టు పక్కల వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

అప్పలరాజు అనే వ్యక్తి ఈ హత్యలు చేసినట్లు తెలిసింది. అతడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అప్పలరాజు కూడా అదే గ్రామానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. వీరిద్దరి మధ్య అర్ధరాత్రి గొడవ జరిగిందని.. ఆ తర్వాత అప్పలరాజు అతి కిరాతకంగా రమణ ఫ్యామిలీని చంపేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక పాత కక్షలు, ఆస్తి తగాదాలే హత్యలకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితుడి విచారణలో మరిన్ని కీలక వివరాలు బయటకు వచ్చే అవకాశముంది. ఒకే ఫ్యామిలీలో ఆరుగురిని హత్య చేయడంతో జుత్తాడ గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. గ్రామస్తులు భయభ్రాంతులకు లోనయ్యారు.

అయితే ఘటన తర్వాత నిందితుడు అప్పలరాజు నేరుగా పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురు హత్యకు గురైన ఘటనతో జుత్తాడ ఉలిక్కిపడింది. ఈ ఉదంతం గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *