TT Ads

మేడ్చల్ జిల్లా : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆర్ ఆర్ పై ఘట్కేసర్ నుండి కీసర సమీపంలో ఆగివున్న ఆటో లో ఒక్కసారి మంటలు చెలరేగాయి , ఆటో ఇంజన్ వేడి అవుతుంది అని గమనించిన ఆటో డ్రైవర్ , ఓ ఆర్ ఆర్ పై తన వాహనం ఆపి ఇంజన్లో కూలెంట్ చెక్ చేస్తుండగా , అకస్మాత్తుగా ఆటోలో ఇంజన్ నుండి మంటలు రావటంతో అప్రమత్తమైన ఆటో డ్రైవర్ శ్రీకాంత్ , ఓ ఆర్ ఆర్ పై చెట్లకు నీళ్లు పొసే వాటర్ ట్యాంక్ సిబ్బంది సహకారంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేయగా , సమాచారం అందుకున్న ఓ ఆర్ ఆర్ ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని , ఫైర్ ఇంజన్ సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు ఏ.ఎస్ఐ పరందమా తెలిపారు , ప్రమాదానికి గురైన AP11X3626 ఆటో నాంపల్లి నుండి కీసరకు చెట్లకు ఉపయోగించే కట్టెలను తీసుకొస్తున్నట్లు , ఆటో ఇంజన్లో సాంకేతిక లోపం ద్వారా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారుల అంచనా..

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *