TT Ads

సమాజానికి సేవ చేయాలని జర్నలిస్ట్ వృతి లోకి వచ్చావు.మీడియా అవతారం ఎత్తావు.నీ కుటుంబానికి ఎంత సంపాదించి పెట్టావు.? నేడు కరోనా కాటుకి ఎంతో మంది సోదరులు కుటుంబాలకు అప్పులు మిగిల్చి పాడె ఎక్కుతున్నారు. ఏ సమాజం కోసమైతే పనిచేసావో అదే సమాజం నీ భార్య పిల్లలు పస్తులుంటే మా కేం పని అన్నట్టు చూస్తుంది. నీవు చేసిన మీడియా యాజమాన్యం నీ దహన సంస్కారాలకు కూడా రూపాయి ఇవ్వడానికి మొఖం చాటేస్తుంది. ఎప్పుడో ఏడాది తరువాత జర్నలిస్ట్ సంక్షేమ నిధి నుండి ముక్కుతూ మూలుగుతూ స్టేజిల మీద ఇచ్చే లక్ష రూపాయలు నీ కుటుంబాన్ని ఆదుకోగలవా? అది నీ కుటుంబం వరకు వస్తుంది అని విశ్వాసం ఉందా! నీకిచ్చిన హెల్త్ కార్డు ఏమైనా అక్కరకు వచ్చిందా? నీ ప్రాణం నిలిపిందా.? 25 ఏళ్ళు జర్నలిస్ట్ గా ఉన్నావు.యిప్పుడు నీవు లేవు.నీ భార్య పిల్లలు తల దాచుకోవ డానికి ఎన్ని డబుల్ బెడ్ రూమ్ లు సంపాదించావు. నీ మరణం తో వారు అనాథ లు అయ్యా రు.నీవు పోతే సాటి జర్నలిస్ట్ లు ( రిప్ ) లు పెట్టడం తప్ప వాళ్ళు ఏం చేయగలరు. ఎందుకంటే వాళ్ళూ.

రోజూ చస్తూ బతుకు తున్నారు. ఎవరో రావాలి ఎదో చేయాలి అని కాకుండా మనం ఉన్నా లేకున్నా మన కుటుంబాలు బతికే ఆలోచన చేయండి. మన చావులు నాయకులకు పబ్లిసిటీకి పనికోస్తాయి తప్ప మనం లేనప్పుడు మన కుటుంబాలకు పనికి రావు. సమాజంతో పాటు ముందు నీ కోసం నీ కుటుంబం కోసం ఆలోచించు… కరోనాతో కానరాని లోకాలకు వెళ్ళిన ప్రతి జర్నలిస్ట్ సోదరుని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నాను.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *