TT Ads

పశ్చిమ గోదావరి జిల్లా:ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగిన “వాలంటీర్లు సేవా పురస్కారాలు” కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు,అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా కుల, మత, వర్గ ప్రాంతం మరియు పార్టీలకు అతీతంగా అత్యంత పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు గడప వద్దకే అందించే బృహత్తర కార్యక్రమంలో నిస్వార్ధంగా అలుపెరగకుండా శ్రమిస్తున్న వాలంటీర్స్ సేవలకు మన ప్రభుత్వం ఈ పురస్కారాలు అందజేయడం జరిగింది.

స్వచ్ఛంద ప్రజా సేవలు అత్యుత్తమ సేవలు అందించిన గ్రామ వార్డు వాలంటరీ లకు మన రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట సేవా పరిష్కారాలు అందించడం జరిగింది,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంకల్పంతో 2019 ఆగస్ట్ 15వ తేదీన వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందని మంత్రి ఆళ్ల నాని గారు పేర్కొన్నారు.సంవత్సరకాలంగా నిరంతరాయంగా సేవలు అందిస్తున్న వాలంటీర్లకు వారు అందించిన సేవకులకు ఆధారంగా మూడు కేటగిరిలో పురస్కారాలు అందించడం జరిగింది.

దాదాపుగా 2,22,990 మంది గ్రామ వార్డు వాలంటీర్స్ కు రూ. 228.74 కోట్ల నగదు నగదు బహుమతి మరియు అవార్డులతో సత్కరించారు జరిగింది,అవినీతికి తావు లేకపోవడం ఇంటింటికి సర్వే పెన్షన్లు పంపిణీ యాప్ ల వినియోగం నవరత్నాల అమలులో భాగస్వామ్యం రేషన్ డోర్ డెలివరీ పెన్షన్ కార్డు రైస్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు, కొవిడ్-19 తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని అవార్డులను ఇవ్వడం జరిగిందని తెలిపిన మంత్రి ఆళ్ల నాని గారు.

సేవా మిత్ర:తొలికథ గిరిలో ఏడాది పాటు నిరంతరాయంగా ఎలాంటి ఫిర్యాదులు లేకుండా సేవలు అందించిన 2,18,115 మంది వాలంటీర్లకు సేవా మిత్ర పురస్కారం బ్యాడ్ తో పాటు రూ.10 వేలు నగదు బహుమతి.

సేవ రత్న:రెండో కేటగిరీలో ప్రతి మండలం లేదా పట్టణంలో ఐదుగురు, కార్పొరేషన్లో 10 మంది వాలంటీర్లకు సేవ రత్న పురస్కారం తో పాటు స్పెషల్ బ్యాడ్జి మెడల్ రూ. 20 వేల నగదు బహుమతి

సేవ వజ్ర:మూడో తరగతిలో ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు వాలంటీర్లకు సేవా మిత్ర పురస్కారంతో పాటు స్పెషల్ బ్యాడ్జి మెడల్ రూ. 30 వేల నగదు బహుమతి.

ఈ పురస్కారాలు అన్నిటినీ నీ గ్రామ వార్డు వాలంటరీ లకు తమ పరిధిలోని 50/100 కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిర్వహిస్తున్నందుకు,గ్రామ వార్డు సచివాలయం కి ప్రజలకు మధ్య సంధాన కర్తగా వ్యవహరించినందుకు ఈ పురస్కారాలను అందజేయడం జరుగుతుంది.

ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో పింఛన్లను క్రమం తప్పకుండా ప్రతినెల ఒకటో తారీఖున అందిస్తున్నందుకు వాలంటీర్లకు ఈ అవార్డులను అందజేయడం జరుగుతుంది,ఐదు సార్లు కొవిడ్ సర్వే నిర్వహణతో పాటు ప్రజలకు మాస్కులు మందులు ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి కరోనా కష్టాల నుంచి ప్రజలను కాపాడినందుకు ఈ పురస్కారాలు అందజేయడం జరుగుతుంది.గ్రామ, వార్డు వాలంటీర్స్ లకు ఉగాది పండుగ సందర్భంగా మన ప్రభుత్వం 261 కోట్లను తో వార్డు సచివాలయం వాలంటీర్లకు సత్కారం చేయడం జరుగుతుందని మంత్రి ఆళ్ల నాని గారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు శాఖ మంత్రి తానేటి వనిత గారు, జాయింట్ కలెక్టర్లు హిమాన్షు శుక్లా గారు, నంబూరి తేజ్ భరత్ గారు, ZP CEO శ్రీనివాస్ గారు, ఇంచార్జ్ RDO పద్మావతి గారు, జిల్లా వ్యవసాయ శాఖ JD గౌసియా బేగం గారు, DEO రేణుకా గారు, ఏలూరు మున్సిపల్ కమిషనర్ D చంద్రశేఖర్ గారు, MRO సోమశేఖర్ గారు, వైయస్సార్ సిపి నాయకులు SMR పెదబాబు, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ మంచెం మైబాబు, MRD బలరాం గారు, మామిళ్ళపల్లి జయ ప్రకాష్ గారు, దిరిశాల వరప్రసాద్ గారు, బొద్దాని శ్రీనివాస్, పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, నెరుసు చిరంజీవులు, గుడిదేశి శ్రీనివాసరావు, నూకపెయ్యి సుధీర్ బాబు, మున్నుల జాన్ గురునాథ్, సుంకర చంద్రశేఖర్, కిలాడి దుర్గారావు, బండారు కిరణ్ కుమార్, జిజ్జవరపు విజయనిర్మల, బేతపూడి ముఖర్జీ గారు, మరియు పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *