TT Ads

అమరావతి: ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమ శిక్షణా చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఐపీఎస్‌గా ఉంటూ ప్రభుత్వం ప్రతిష్టకు భంగం వాటిల్లింప చేసేలా ఏబీవీ వ్యాఖ్యలు చేశారని అభియోగం దాఖలు చేసింది. కమిషనరాఫ్ ఎంక్వైరీస్ విచారణ అనంతరం ఏబీవీ చేసిన కామెంట్లని జగన్ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. 30 రోజుల్లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. నిఘా పరికరాల కొనుగోళ్లల్లో అవకతవకల అభియోగంపై ఇప్పటికే ఏబీవీ సస్పెన్షన్‌లో ఉన్నారు. సర్వీస్ రూల్సుకు వ్యతిరేకంగా వ్యవహరించారని మరోసారి ఏబీ వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *