TT Ads

New Covid-Guidelines రాష్ట్రంలో తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు మరోసారి పెరుగుతుండటంతో ప్రభుత్వం కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

ప్రధానాంశాలు:

మాస్క్ లేకుంటే జరిమానా

గ్రామాలు, పట్టణాలకు వేర్వేరుగా జరిమానా

దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కోవిడ్-19 కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలోగడిచిన పది రోజులుగా పాజిటివ్ కేసులు అధికంగాఉన్నాయి. దీంతో నాలుగు రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 మార్గదర్శకాలను జారీచేసింది. ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లో కోవిడ్ నిబంధనల్ని  తప్పనిసరిగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కరోనా రెండో దశ వ్యాపిస్తున్నందున్న నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

అవకాశం ఉన్నంత వరకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని మరోసారి అవలంభించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దేశంలోనూ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పరిశ్రమలు, దుకాణ సముదాయాలు, ఫ్యాక్టరీల్లో నియంత్రణా చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. షాపింగ్ మాల్స్, పరిశ్రమల్లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలని, చేతులను శుభ్రం చేసుకోడానికి శానిటైజర్ అందుబాటులో ఉంచాలని , అలాగే, మాస్క్‌లు తప్పనిసరిగా ధరించి, భౌతికదూరం నిబంధనలు పాటించాలని వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. మార్చి 23 నుంచి మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్‌లు ధరించకపోతే జరిమానా.గ్రామీణ ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించకుండా తిరిగితే రూ.500, పట్టణాల్లోని రూ.1,000 వసూలు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు అందాయి. ఫైన్‌కు సంబంధించిన పుస్తకాలను పోలీసులకు ఇప్పటికే అందినట్టుల్లో అధికారులు తెలిపారు. అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించి మీ ఆరోగ్యంతోపాటు ఇతరుల ఆరోగ్యానికి దోహదపడాలని అధికారులు కోరుతున్నారు.

రవాణా వాహనాలు, యంత్రాలు, ప్రాంగణాల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి చేయాలని కంపెనీలను ఆదేశించింది ప్రభుత్వం. ముఖ్యంగా శానిటైజేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు చేపట్టాల్సిందిగా అధికారులు ఆదేశించింది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *