TT Ads

వైఎస్సార్‌సీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి, టీడీపీ నుంచి పనబాక లక్ష్మి, బీజేపీ నుంచి రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి చింతా మోహన్‌లు బరిలోకి దిగారు. ఈ నలుగురు అభ్యర్థులు నామినేషన్‌ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం వారి ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి కుటుంబ ఆస్తులు రూ.47.25 లక్షలు. ఆయన పేరు మీద రూ.10,66,515 విలువైన చరాస్తులు ఉన్నాయి. భార్య నవ్యకిరణ్‌ పేరు మీద రూ.24,92,529 విలువైన చరాస్తులు ఉన్నాయి. భార్య పేరిట రూ.7 లక్షల విలువైన కారు ఉంది. ఏర్పేడు మండలంలో మన్నసముద్రం గ్రామంలో రెండెకరాల వ్యవసాయ భూమి (డీకేటీ), 2,610 చదరపు అడుగుల్లో ఇల్లు ఉంది. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం వీటి విలువ రూ.5 లక్షలు. అప్పులు లేవు.. క్రిమినల్‌ కేసులూ
గురుమూర్తిపై ఆధారపడిన కార్తికేయ నిక్షాల్‌ దగ్గర 62 గ్రాముల బంగారం, డెలీనా నిక్షాల్‌ దగ్గర 83 గ్రాముల బంగారం ఉన్నట్లు తెలిపారు.

బీజేపీ అభ్యర్థి రత్నప్రభ కుటుంబ ఆస్తులు రూ.24.68 కోట్లు. ఇందులో రత్నప్రభ పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.19,57,75,095. రత్నప్రభ భర్త ఎ.విద్యాసాగర్‌ పేరున ఉన్న ఆస్తులు రూ.5,10,77,146. రత్నప్రభకు రూ.25,000 డబ్బులు.. బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు రూ.2.81 కోట్లు, బాండ్ల రూపంలో రూ.28 వేలు, పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌లో రూ.4 లక్షలు. రూ.52 లక్షల విలువైన బంగారం, రూ.1.95 లక్షల విలువైన వెండి. *రూ.16 లక్షల విలువైన రెండెకరాల వ్యవసాయ భూమి, రూ.3 కోట్ల విలువైన వ్యవసాయేతర భూమి ఉందని అఫిడవిట్‌లో పొందుపరిచారు. ఎస్‌బీఐలో ఆమెపేరిట రూ.2.43 లక్షల రుణం ఉంది. భర్త పేరిట కోటి విలువైన చరాస్తులు.. రూ.4.10 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆంధ్రాబ్యాంకులో రూ.17.30 లక్షల వ్యవసాయ రుణం తీసుకున్నారు. వీరిపై ఎలాంటి కేసులు లేవు.

పనబాక లక్ష్మి లక్ష్మి కుటుంబ ఆస్తుల విలువ రూ.10,23,38,628. ఆమె పేరుపై రూ.7.77 కోట్లు ఉండగా.. భర్త పనబాక కృష్ణయ్య పేరున రూ.2.45 కోట్ల ఆస్తులున్నాయి. పనబాక లక్ష్మి బ్యాంకు ఖాతాల్లో నగదు, ఇతర ఆస్తుల విలువ రూ.2.05 కోట్లు, వ్యవసాయ భూమి, ఇతర ఆస్తుల విలువ రూ.5.70 కోట్లుగా ఉన్నాయి. తన భర్త పనబాక కృష్ణయ్య బ్యాంకు ఖాతాల్లో రూ.44.37 లక్షలున్నట్లు తెలిపారు. తమ కుటుంబానికి ఆదాయ వనరులుగా వ్యవసాయం, పింఛన్లు ఉన్నట్లు పేర్కొన్నారు.

కృష్ణా జిల్లా గుడివాడ తాటివర్రులో తన పేరుపై ఐదున్నర ఎకరాలు.. మరో 4.40 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని అఫిడవిట్‌లో తెలిపారు. తన భర్త పేరుపై కోట మండలం వెంకన్నపాలెంలో 2.34 ఎకరాలు, చిట్టేడులో 15.05 ఎకరాలు, కోటలో 6 ఎకరాలు ఉన్నట్లు చూపించారు. అలానే తన పేరుపై హైదరాబాద్‌, విజయవాడలో 1212 చదరపు గజాల స్థలం ఉందని.. హైదరాబాద్‌లో రెండు ఫ్లాట్లు ఉన్నట్లు తెలిపారు. తన భర్త పేరుపై శంషాబాద్‌లో 400 చదరపు గజాలు స్థలం, కోట మండలం వెంకన్నపాలెంలో ఒక ఇల్లు ఉన్నట్లు పేర్కొన్నారు. తనపై ఎక్కడా కూడా పోలీసు కేసులు లేవని వివరాలను పొందుపరిచారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *