TT Ads

ఖమ్మం: మున్సిపల్ రంగంలో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ విధానం రద్దు చేసి అందరిని పర్మినెంట్ చేయాలని, 11వ పిఆర్పీ ప్రకారం కేటగిరీల వారిగా వేతనాలు నిర్ణయించి చెల్లించాలని సమాన పనికి సమాన వేతనం కనీస వేతనం రూ. 24 వేలు చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం ఖమ్మం నగర పాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది హాజరు పాయింట్ వద్ద మే నెల 22,23 వ తేదీల్లో జరిగే ఖమ్మం జిల్లా ఏఐటియుసీ మున్సిపల్ ఖమ్మం జిల్లా రెండవ మహా సభల కరపత్రాలు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కార్పోరేషన్, మున్సిపాలిటీల్లో పురపాలక సంఘాల్లో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ తదితర పద్దతుల్లో పనిచేస్తున్న సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వం ప్రకటించిన 11 వ పిఆర్పీ జీవో వెంటనే విడుదల చేయాలని మున్సిపల్ సిబ్బందికి కెటగిరిలవారిగా జీతాలు పెంచాలని మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది సమస్యలపై కేసీఆర్ ప్రభుత్వం మున్సిపల్ సిబ్బందికి ఇచ్చిన హామీలు అమలు కోసం ఏఐటియుసీ మున్సిపల్ కార్మిక సంఘం భవిష్యత్ ఉద్యమాల నిర్వహణ తదితర అంశాలపై మహా సభలో నిర్ణయాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు షేక్ హుస్సేన్, కందుల మహేష్, యం. రాంబాబు, టి.రాములు, యం.శ్రీను, యం. శేఖర్ బాబు, పి. బాబు సిహెచ్. లలితా, పద్మా, యాకమ్మ తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *