TT Ads

అమరావతి:ఎస్‌ఈసీ సవాల్​పై హైకోర్టులో ఉదయం విచారణకు అవకాశంపరిషత్ ఎన్నికల నిలుపుదలపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎస్‌ఈసీ సవాల్‌ చేసింది.ఉన్నత న్యాయస్థానం సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం డివిజన్‌ బెంచ్​ తలుపుతట్టింది ఈ మేరకు డివిజన్‌ బెంచ్‌లో ఎన్నికల సంఘం తరఫున హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు అప్పీలు చేసిన కార్యదర్శి పరిషత్ ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది.ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబు అప్పీల్ దాఖలు చేశారు.హైకోర్టులో పిటిషన్ వేసిన తెలుగుదేశం నేత వర్ల రామయ్య  పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కాదని వ్యక్తిగత హోదాలో అయన వేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి కొట్టేసి ఉండాల్సిందని పేర్కొన్నారు నాలుగు వారాల ముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళి విధించాలనే చట్టబద్ధ నిబంధన లేదన్న ఎస్ఈసీ ఎన్నికల కోడ్ అమలు విషయంలో విచక్షణాధికారం ఎన్నికల సంఘానిదేఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది.ఈ అప్పీల్​పై ఉదయం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *