TT Ads

అమరావతి: ఎస్సీల కోసం కట్టిన కమ్యూనిటీ హాల్‌లో గ్రామ సచివాలయ కార్యాలయాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. నెల్లూరు కబాడీ పాలెం ఎస్సీ కమ్యూనిటీ హాల్ లో గ్రామ సచివాలయం నిర్వహిస్తున్నారు అంటూ మేడూరి ప్రశాంత్ కుమార్ అనే నెల్లూరు వాసి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఎస్సీ ప్రజల శుభకార్యాల కోసం వారి అభ్యున్నతి కోసం కట్టే కమ్యూనిటీ హాల్స్‌లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తారా? అని నిలదీసింది. తక్షణమే కార్యాలయాన్ని అక్కడి నుంచి తరలించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాన్ని కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించడం వల్ల ఎస్సీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, పెళ్లిళ్లు శుభకార్యాలు చేసుకోవటానికి లక్షలు వెచ్చించాల్సి వస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నాలుగు వారాల్లో కమ్యూనిటీ హాల్ ఖాళీ చేసి వేరేచోట ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *