TT Ads

లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సోయం బాబు రావు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఎల్ . హెచ్ . పి . ఎస్ కార్యదర్శి బానోత్ రమేష్ నాయక్ అన్నారు . చట్టసభల్లో ఉండే సభ్యులు , పార్లమెంటు సభ్యుడు హోదాలో ఉన్న ఆదిలాబాద్ ఎంపీ సోయంబాబు రావ్ అమాయక గిరిజన లంబాడీల ఆత్మగౌరవానికి కించపరిచే విధంగా గిరిజన లంబాడీలను దోశులుగా , వలసవాదులుగా , గిరిజనులు కాదని , లంబాడీలు అందరూ బాగుపడ్డారని చిత్రికరించటాన్ని , తప్పుడు ప్రచారాన్ని గిరిజన లంబాడి సమాజం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు . అమాయక గిరిజన లంబాడీలపై కావాలని కుట్రలు చేస్తున్నారని , లంబాడీలపై తప్పుడు సంకేతాలతో సమాజాన్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమాలకు పాల్పడుతూ ఇలాంటి పనులు చేస్తే ఇక ముందు యావత్ గిరిజన లంబాడా సమాజం భవిష్యత్తులో చూస్తూ ఊరుకునేది లేదని పేర్కొన్నారు . గిరిజన లంబాడీల సమాజం ఓపిక సహనాన్ని పరీక్షించడం మంచిది కాదని , ఈ సంఘటనలకు కారకులను వివిధ వర్గాల , వివిద పార్టీల లంబాడీలకు వ్యతిరేకంగా పనులు చేస్తున్న వారికి త్వరలో సరైన బుద్ధిచెప్పక తప్పదని గిరిజన లంబాడీ సమాజం తరపున హెచ్చరిస్తున్నాని అన్నారు . అమాయ లంబాడా గిరిజనుపై జరుగుతున్న కుట్రలను , దాడులను దుప్రచారాన్ని తిప్పి కొట్టటానికి గిరిజన లంబాడీలు తమ నంగారా మోగించడం ఖాయమని తెలిపారు . కావాలని గిరిజన లంబాడీల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడానికి ఎస్టీ జాబితాలో నుండి లంబాడీలను తొలగించాలనే డిమాండ్ అర్ధరహితమైనదని అన్నారు.
రాజ్యాంగం 342/ 1 342/2 చదవండి దీని ప్రకారమే షెడ్యూల్ ట్రైబ్స్ అయ్యాము. మేము గిరిజన లంబాడీల 108 / 1976 యాక్ట్ ద్వారా అమెండ్మెంట్ ఆర్డర్ ద్వారా లంబాడీలు ఎస్టీలుగా గుర్తింపు పొందారు . గిరిజనుల అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే అందరికీ లబ్ధి చేకూర్చే గిరిజన రిజర్వేషన్ అమలు అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని అన్నారు . అమాయక లంబాడీలు అంటే గిట్టని కొన్ని పార్టీలు , ఇతర రాజకీయ నాయకులు వారి స్వార్థ రాజకీయాల కోసం ఎంపీ సాయం బాబు రావ్ ని ఉసిగోలపడం వల్ల అమాయక గిరిజనుల మద్య చిచ్చు పెడుతున్నారని ఎద్దేవా చేశారు . 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో గిరిజనుల బతుకుల్లో ఏమాత్రం మార్పు జరగలేదు , పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తూ అమాయక ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు . ఇటువంటి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సొయం బాబూరావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని , లంబాడీల స్థితిగతులపై బీజేపీ పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని పేర్కొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *